Telangana Assembly: తగ్గేదేలే.. వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు శనివారం ప్రారంభమయ్యాయి.. ఇవాళ కీలక అంశాలపై ప్రభుత్వం, విపక్షాల మధ్య వాడీవేడీగా చర్చ జరగనుంది. అయితే.. జగదీష్‌రెడ్డి వివాదం తర్వాత ఇవాళ సభ జరగనుండటంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు శనివారం ప్రారంభమయ్యాయి.. ఇవాళ కీలక అంశాలపై ప్రభుత్వం, విపక్షాల మధ్య వాడీవేడీగా చర్చ జరగనుంది. అయితే.. జగదీష్‌రెడ్డి వివాదం తర్వాత ఇవాళ సభ జరగనుండటంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది.. ఇక, ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడనున్నారు. అలాగే, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెడుతూ సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. బీఆర్‌ఎస్ లేవనెత్తే అంశాలపై దీటుగా జవాబు చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది.
కాగా.. సభ ప్రారంభం కాగానే హరీష్ రావు మాట్లాడుతూ.. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు.
కాగా.. ఈనెల 27వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఈనెల 19న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.. 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముంది. 21వ తేదీ నుంచి బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుండగా.. ఈనెల 27 వరకు పలు పద్దులపై చర్చలు కొనసాగుతాయి.

అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోర్లు ఊడిపోతున్నాయి.. ఆ గ్రామాలకేమైంది

కొడుకు గాయపడితే తండ్రికి ఆపరేషన్.. ఏకి పారేస్తున్న నెటిజన్స్

మొన్న అల్లుడితో అత్త.. ఇప్పుడు కూతురి మామతో మహిళ జంప్

తాటి ముంజలు ఇష్టంగా తింటున్నారా?

పెళ్లి పీటలపై వధువు స్థానంలో ఆమె తల్లి..షాకైన పెళ్లికొడుకు తర్వాత

వామ్మో.. బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాలు వీడియో

రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
