- Telugu News Photo Gallery Spiritual photos Vastu Shastram: To avoid money problems in this life, keep a peacock feather in this corner of the house
Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా.. ఆర్ధిక సమస్యలా.. అన్ని అడ్డంకులు నివారించేందుకు నెమలి ఈకలను ఇలా పెట్టుకోండి..
పురాణ గ్రంధాల ప్రకారం హిందూ మతంలో నెమలి ఈకలకు ప్రత్యేక స్థానం ఉంది. కన్నయ్యకు కూడా అత్యంత ఇష్టమైన నెమలి ఈకకు వాస్తు శాస్త్రంలో విశిష్ట స్థానం ఉంది. ఈ జీవితంలో డబ్బు సమస్యలను నివారించడానికి ఇంట్లో ఈ మూలలో నెమలి ఈకను ఉంచండి. నెమలి ఈకలకు మతపరమైన దృక్కోణం నుంచి మాత్రమే కాదు జ్యోతిషశాస్త్ర దృక్కోణంలో కూడా మంచి ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో వాస్తు దోషాలను తొలగించడానికి నెమలి ఈకలను ఉపయోగించవచ్చు. అయితే ఇంట్లో నెమలి ఈకలను పెట్టుకునే ముందు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి.
Updated on: Mar 17, 2025 | 7:53 AM

Peacock Feather

దంపతుల మధ్య వివాదాలా.. ఇంట్లోని పూజ గదిలో రెండు నెమలి ఈకలను కలిపి ఉంచడం వల్ల వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు నెమలి ఈకలను ఇలా ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లోని ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది.

ఇంటి ప్రధాన ద్వారం తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం వంటి దిశల్లో లేకుంటే లేదా ప్రధాన ద్వారంలో ఏదైనా వాస్తు లోపం ఉంటే.. ఆ ఇంటి ప్రధాన ద్వారం తలుపుపై కూర్చున్న గణేశుడిని ప్రతిష్టించాలి. గణపతి నెత్తిమీద మూడు నెమలి ఈకలను ఉంచండి.

ఇంట్లో డబ్బు సమస్యలను పరిష్కరించడానికి.. శుక్ల పక్షంలో ఆగ్నేయ మూలలో కనీసం 5 అడుగుల ఎత్తులో రెండు నెమలి ఈకలను ఉంచడం వల్ల డబ్బు సమస్యలు పరిష్కారమవుతాయి.

ఇంట్లోని డ్రాయింగ్ రూమ్ లేదా డైనింగ్ రూమ్‌లో 11, 15 లేదా అంతకంటే ఎక్కువ నెమలి ఈకలను కలిపి ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం మెరుగుపడుతుందని.. ఇంటి సభ్యుల మధ్య ప్రేమ నెలకొంటుందని నమ్మకం.

ఇంట్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో నెమలి ఈకలు కూడా సహాయపడతాయి. నెమలి ఈకలు ఉంచిన ప్రదేశం చుట్టూ ఎటువంటి కీటకాలు రావు.




