- Telugu News Photo Gallery Spiritual photos Guru Transit to Gemini: These are Lucky Zodiac Signs Details in Telugu
Lucky Zodiac Signs: గురు గ్రహ అనుగ్రహం.. ఆ రాశుల వారికి ధన, అధికార యోగాలు..!
Jupiter Transit 2025: వృషభ రాశిలో ఏడాదిగా సంచారం చేస్తున్న గురు గ్రహం మే 25 నుంచి మిథున రాశిలో తన సంచారం ప్రారంభించడం జరుగుతుంది. అంటే మరో 70 రోజులు మాత్రమే వృషభ రాశిలో గురువు సంచారం చేయడానికి అవకాశం ఉంది. వృషభ రాశి నుంచి వెళ్లబోతున్న గురువు తనకు సొంత రాశులతో పాటు, తన దృష్టిపడిన రాశులకు రెట్టింపు బలంతో ధన, పుత్ర, గృహ, అధికార యోగాలను కలగజేయడం జరుగుతుంది. తన దృష్టిపడిన రాశులకు తాను చేయవలసిన శుభాలన్నిటినీ వేగంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా గురువు అనుగ్రహానికి గురవుతున్న రాశుల్లో వృషభం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకరం, మీన రాశులున్నాయి.
Updated on: Mar 16, 2025 | 9:31 PM

వృషభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న గురువు మరో రెండు నెలల పది రోజుల కాలంలో తప్పకుండా ఆదాయాన్ని బాగా పెంచే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుదల వంటివి తప్పనిసరిగా చోటు చేసుకుంటాయి. ఆదాయ వృద్దికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందే అవకాశం ఉంది.

కన్య: వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు పంచమ దృష్టితో కన్యారాశిని వీక్షించడం జరుగుతోంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న నిరుద్యోగుల కల తప్పకుండా నెరవేరుతుంది. విదేశాల్లో స్థిరత్వం లభించే అవకాశం కూడా ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. తండ్రి వైపు నుంచి భారీగా ఆస్తి కలిసి వస్తుంది.

వృశ్చికం: గురువు ప్రస్తుతం సప్తమ దృష్టితో ఈ రాశిని వీక్షించడం జరుగుతోంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయం సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వైవాహిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది.

ధనుస్సు: ఈ రాశికి అధిపతి అయిన గురువు వృషభ రాశి నుంచి నిష్క్రమించే ముందు తప్పకుండా ఈ రాశివారిని ఉద్యోగంలో అందలాలు ఎక్కించే అవకాశం ఉంది. ఒక మంచి సంస్థలో సర్వాధికారిని చేసే సూచనలు కూడా ఉన్నాయి. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్మును రాబట్టుకోవడం జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది.

మకరం:ఈ రాశిని గురువు నవమ దృష్టితో వీక్షించడం జరుగుతోంది. వచ్చే రెండు నెలల కాలంలో ఈ రాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితంలోని సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

మీనం: ఈ రాశికి అధిపతి గురువు అయినందువల్ల ఈ రాశివారు ఇక ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా రెట్టింపు అనుకూలమైన ఫలితాలనిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. ఇష్టమైన ప్రాంతాలను, ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగంలో కనీ వినీ ఎరుగని శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.



