Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Grahan 2025: ఈ నెలలో ఏర్పడనున్న సూర్యగ్రహణం.. ఈ రాశులకు లాభాలు, కొన్ని రాశులకు నష్టాలు తెస్తుంది. అవి ఏమిటంటే..

ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఈ నెలలోనే ఏర్పడనుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణ ప్రభావం మొత్తం 12 రాశుల ప్రజలపై కనిపిస్తుంది. అదే సమయంలో శనీశ్వరుడు సంచారము చేసి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్ర గణనల ప్రకారం ఈ సంవత్సరంలో ఏర్పడనున్న మొదటి సూర్యగ్రహణం, మీన రాశిలో శనిశ్వర సంచారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా .. ప్రయోజనకరంగా ఉండబోతుంది. అదే సమయంలో కొన్ని రాశులు జాగ్రత్తగా ఉండాలి.

Surya Grahan 2025: ఈ నెలలో ఏర్పడనున్న సూర్యగ్రహణం.. ఈ రాశులకు లాభాలు, కొన్ని రాశులకు నష్టాలు తెస్తుంది. అవి ఏమిటంటే..
Solar Eclipse
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2025 | 12:07 PM

జ్యోతిషశాస్త్రంలో సూర్య, చంద్ర గ్రహణాలు చాలా ప్రత్యేకమైన సంఘటనలుగా పరిగణించబడతాయి. ఈ కాలంలో పూజ లేదా ఆహారం తినడం వంటి ఏదైనా శుభ కార్యం నిషేధించబడింది. ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం హోలీ రోజున ఏర్పడింది. అయితే ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం త్వరలో సంభవించనున్నది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వాటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రరాశులతో పాటు గ్రహణాలు కూడా రాశులపై ప్రభావం చూపుతాయి. చాలా సార్లు గ్రహణాలు కొన్ని రాశులకు చెందిన వ్యక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి. అదే సమయంలో కొన్ని రాశులకు గ్రహణం ఒక వరం కంటే తక్కువ కాదు. ఈ నేపధ్యంలో ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏ రాశులకు అదృష్టాన్ని చేకూరుస్తుంది? ఎవరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందో తెలుసుకుందాం..

ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఎప్పుడంటే

జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29న, అంటే పాల్గుణ మాసంలోని అమావాస్య తిథి రోజున మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య తిధి ముగింపు సాయంత్రం 6:16 గంటలకు జరుగుతుంది. అయితే సూర్య గ్రహణం మార్చి 29న ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా సూతక కాలం కూడా చెల్లదు. ఈ ప్రభావం 12 రాశులపై పూర్తిగా కనిపిస్తుంది.

ఏ రాశుల వారికి సూర్యగ్రహణం అదృష్టం తీసుకోస్తుందంటే

మేష రాశి: ఈ సంవత్సరం ఏర్పడనున్న మొదటి సూర్యగ్రహణం మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనం కొనాలనే కోరిక నెరవేరవచ్చు. అంతే కాదు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కలుగుతాయి.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం కర్కాటక రాశి వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది. డిపాజిట్ చేసిన మూలధనంలో పెరుగుదల ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది.

మకర రాశి: మకర రాశి వారికి సూర్యగ్రహణం, శని సంచారము కలయిక శుభ సంకేతాలను తెస్తోంది. దీనివల్ల ఈ రాశి వారు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న కోర్టు కేసులలో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో సీనియర్ అధికారులతో సమన్వయం పెరుగుతుంది. దీనివల్ల జీతం పెరగడంతో పాటు పదోన్నతి కూడా లభిస్తుంది. వీరు పెట్టుబడి పెట్టిన పాత పెట్టుబడులతో ప్రయోజనం పొందుతారు. పూర్వీకుల ఆస్తి పొందే అవకాశం ఉంది. అంతేకాదు వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.

ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలంటే

సూర్యగ్రహణం.. మీనరాశిలో శనీశ్వర సంచారం మేష రాశి, వృశ్చిక రాశి వారిపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వీరు ఆరోగ్యం, ఉద్యోగం, కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు