- Telugu News Photo Gallery Jupiter's transit will cause difficulties for people of three zodiac signs
అయ్యో ఈ రాశులకు ఇక కష్టకాలమేనా.. ఎందుకంటే?
జ్యోతిశ్యశాస్త్రంలో రాశులు, గ్రహాలకు చాలా ప్రముఖ స్థానం ఉంటుంది. అయితే కొన్ని సార్లు గ్రహాలు రాశులను మారడం వలన కొన్ని రాశుల వారికి కష్టాలు, నష్టాలు వస్తే, మరికొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. అయితే సంపదను ప్రసాదించే బృహస్పతి గ్రహం మూడు సార్లు సంచారం చేయనున్నాడు. దీంతో మూడు రాశుల వారికి కష్టకాలమేనంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
Updated on: Mar 17, 2025 | 11:45 AM

సంపద, ఆనందం, గౌరవానికి ప్రతీకగా ఉండే బృహస్పతి గ్రహం, 2025లో మూడు సార్లు రాశి మారబోతుంది. ప్రస్తుతం ఈ రాశి వృషభ రాశిలో ఉంది. మే 15న ఈ రాశి మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇది మొదటి సంచారం.

అక్టోబర్ 18న బృహస్పతి మిథున రాశిని వదిలేసి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇది రెండో సంచారం, తర్వాత డిసెంబర్ 4న కర్కాటక రాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశిస్తుంది. ఇది మూడో సంచారం. దీని వలన మూడు రాశుల వారు కష్టాలు ఎదుర్కోనున్నారు.

వృశ్చిక రాశి వారికి బృహస్పతి మూడు రాశులను మారడం వలన చాలా కష్టాలను ఎదుర్కొంటారు. వీరికి ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఏ పని చేసినా అందులో విజయం సాధించడం కష్టం అవుతుంది.

బృహస్పతి సంచారం వలన మకర రాశి వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా ఉత్తమం.

మీన రాశి వారు ఆర్థికంగా చాలా బలహీనంగా అయిపోతారు. అవసరానికి చేతికి డబ్బు అందదు. అప్పులు పెరిగిపోతాయి. అనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. జీవితం కష్టంగా మారిపోతుంది.





























