- Telugu News Photo Gallery This is the information that those planning a summer tour to Ooty need to know
సమ్మర్‌లో ఊటీ ప్లాన్ చేస్తున్నారా? తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది టూర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా వేసవిలో ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి చల్లటి ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటారు. అందుకే చాలా మంది సమ్మర్ టూర్‌గా ఎక్కువగా ఊటీకి వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. చల్లటి వాతావరణం, పచ్చని చెట్లు, లోయలుతో ఉన్న ఊటీ అందాలను చూస్తూ మురిసిపోతారు. అయితే ఊటీ వెళ్లాలి అనుకునే వారు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలంట. అవి ఏవి అంటే?
Updated on: Mar 17, 2025 | 10:58 AM

భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతంలో ఊటీ ఒకటి. ఇది నీలగిరి పర్వతాలలో అందమైన లోయలలో ఉంటుంది. అక్కడి చల్లటి వాతావరణం, ఊటీ అందాలు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. అయితే ఊటీకి వెళ్లే వారు ఈ విషయాలుపై అవగాహన ఉంచుకోవాలంట.

ఊటీ వెళ్లడానికి మంచి సమయం ఏది అంటే ఏప్రిల్ నుంచి జూన్, అలాగే సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య ఊటీకి వెళ్లి చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చునంట.

ఊటీకి విమానాశ్రయం లేదు, కానీ దీనికి దగ్గరిలో కోయంబత్తూర్ విమానాశ్రయం ఉంది. ఇది దాదాపు 88 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా ఊటీ చేరుకోవచ్చు.రైలు మార్గం ద్వారా ఊటీ చేరుకోవడానికి మీరు మెట్టుపాలయం వరకు రైలులో ప్రయాణించి, అక్కడి నుండి ప్రసిద్ధ నీలగిరి పర్వత రైల్వే ద్వారా ఊటీకి ప్రయాణించవచ్చునంట. అలాగే రోడ్డు మార్గం ద్వారా కూడా ఊటీకి వెళ్లొచ్చు.

ఊటీకి వెళ్లేవారు మొదట ఊటీ సరస్సు చూడొచ్చు. ఇక్కడ బోటింగ్ చేస్తూ ఊటీ అందాలను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత నీలగిరి పర్వత వద్దకు రైలు ద్వారా ప్రయాణం చేయాలి. తర్వాత ఊటీలోని ఎత్తైన శిఖరం దొడ్డ బెట్ట ఇది. చూడటానికి చాలా బాగుంటుంది.

వాటి తర్వాత బొటానికల్ గార్డెన్, ఇక్కడ అందమైన పూల తోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి, కాసా సర్సు చూడటమే కాకుండా అక్కడ ట్రెక్కింగ్ చేసి మంచి అనుభూతి పొందవచ్చు.





























