అందంతో చంపేస్తున్న శోభా శెట్టి.. చూపు తిప్పుకోవడం కష్టమే
శోభా శెట్టి గురించి స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీరియల్స్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ నటి. బుల్లితెర ఫేమస్ యాక్టర్స్‌లో శోభా శెట్టి ఒకరు. తాజాగా ఈ బ్యూటీ రెడ్ డ్రెస్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. తన నవ్వుతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Mar 17, 2025 | 10:15 AM

బుల్లితెర బ్యూటీ శోభా శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. కార్తీక దీపం సీరియల్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సీరియల్‌లో మౌనిత పాత్రలో సూపర్‌గా నటించి మంచి ఫేమ్ సొంతం చేసుకుంది.

తర్వాత బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి అక్కడ తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లోనే అనుకుంటే బిగ్ బాస్‌లో కూడా తన విలనిజం చూపించి కంటెస్టెంట్స్‌కు చుక్కలు చూపెట్టింది.

తర్వాత ఎలిమినెట్ అయ్యింది. మళ్లీ సీరియల్స్‌తో ఫుల్ బిజీ అయిపోయింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఆ మధ్య కన్నడ బిగ్ బాస్‌లోకి కూడా వెళ్లి అనారోగ్యం కారణంతో మధ్యలోనే సెల్ఫ్ ఎలిమినెట్ అయ్యి బయటకు వచ్చినట్లు సమాచారం.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో అదరహో అనిపించింది.

శారీని తలపిస్తున్న రెడ్ డ్రెస్‌లో కుందనపు బొమ్మలా తయారై, అందాలను ఆరబోసింది. పచ్చని చెట్ల మధ్య బుట్టబొమ్మలా కనిపించి తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.





























