- Telugu News Photo Gallery Spiritual photos Lord shani temples: These are popular temples of lord shanishwara in india
Lord Shani: ఎవరి జాతకంలో నైనా శని దోషం ఉందా.. ఈ ఆలయాల్లో ఏ ఒక్కదానికి వెళ్లినా దోషం నుంచి విముక్తి
నవ గ్రహాల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడు, ఛాయల తనయుడు శని దేవునికి శనివారం అంకితం చేయబడింది. ఈ రోజున శని దేవుడిని పూజించడం వల్ల వ్యక్తి జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. కనుక శనివారం శని దేవుడిని పూజించడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. దేశంలోని వివిధ ప్రదేశాలలో శని దేవుడి ఆలయాలు ఉన్నాయి. అయితే జాతకంలో శని దోషం ఉంటే.. ఆ దోషం నుంచి విముక్తినిచ్చే శనీశ్వరుడు ఆలయాలు ఉన్నాయి. ఈ రోజు శనీశ్వరుడు కొలువైన ప్రసిద్ధ దేవాలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Mar 24, 2025 | 12:58 PM

శని శింగనాపూర్ - మహారాష్ట్ర: ఈ ఆలయం మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన శనీశ్వర దేవాలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో పూజలు చేయడానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. దీనితో ముడిపడి అనేక నమ్మకాలు ఉన్నాయి. ఈ ప్రదేశం శనీశ్వరుడు స్థానమని నమ్ముతారు. ఇక్కడ ఉన్న విగ్రహాన్ని శనీశ్వరుడు స్వయంగా సృష్టించిన విగ్రహంగా భావిస్తారు. ఇది 5 అడుగుల 9 అంగుళాల పొడవు ..1 అడుగు 6 అంగుళాల వెడల్పు ఉంటుంది. ఈ ఆలయానికి చెందిన మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ శనీశ్వరుడి ఆలయంలో పూజారి లేడు. ఇక్కడ శనీశ్వరుని విగ్రహానికి నూనె సమర్పించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం.

శనీశ్వర ఆలయం- ఇండోర్: ఈ ఆలయం శనీశ్వరుడి పురాతన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ శని పర్వతానికి ప్రదక్షణ చేయడం వలన శని దోషం నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయంలో స్వయంభువుగా శనీశ్వరుడు వెలసినట్లు చెబుతారు. దీనితో పాటు ఈ ఆలయంలో శని దేవుడిని నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని.. ఎవరైతే ఏలి నాటి శని తో బాధపడుతున్న వారికి ఆ దశ ముగుస్తుందని నమ్ముతారు. ఈ ఆలయం గురించిన ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శనిశ్వరుడికి పదహారు రకాల అలంకారాలు చేస్తారు. ఇక్కడ శని దేవుడికి నూనెకు బదులుగా సింధూరాన్ని సమర్పిస్తారు.

శనీశ్వర ఆలయం- ప్రతాప్‌గఢ్: ఇది ఉత్తర ప్రదేశ్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన శనీశ్వర ఆలయం. దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో శని దేవుడిని పూజించడానికి ఇక్కడకు వస్తారు. ఈ ఆలయం ప్రతాప్‌గఢ్ జిల్లా నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి చెందిన ప్రత్యేకత ఏమిటంటే భక్తులు ఇక్కడికి వచ్చిన వెంటనే వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ ఆలయాన్ని శని ధామ్ అని పిలుస్తారు. ఇది శనిశ్వరుడికి చెందిన అద్భుత ఆలయాలలో ఒకటి.

శనీశ్వర ఆలయం - తిరునల్లార్: ఈ ఆలయం తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. ఇక్కడ కూడా భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఈ శనీశ్వర ఆలయం బాధలను తొలగించే ఆలయంగా పరిగణించబడుతుంది. ఎవరైనా దీర్ఘ కాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ, కష్టాలు, నష్టాలను ఎదుర్కొంటుంటే.. ఈ ఆలయంలో శని దేవుడిని పూజించాలని చెబుతారు. దీనివల్ల శని దోషం తొలగిపోయి సమస్యలు పరిష్కారమవుతాయి.

శనిచార ఆలయం- మొరెనా: ఇది కూడా శని దేవ్ ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో శని దేవుడిని పూజించడం ద్వారా తగిన ఫలాలు లభిస్తాయి. శని దోషాలు తగ్గుతాయి. మధ్యప్రదేశ్‌లో చాలా అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ శని దేవ్ ఆలయం మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలోని శని పర్వతంపై ఉంది. ఈ ఆలయాన్ని శనిచార ఆలయం అని కూడా పిలుస్తారు.





























