- Telugu News Photo Gallery Spiritual photos Temples are not tourist spots: India famous temple where non hindus entry is prohibited
Hindu Temples: మన దేశంలో ఈ ప్రసిద్ధ దేవాలయాల్లో హిందువులకు తప్ప అన్యమతస్థులకు ప్రవేశం లేదని తెలుసా..
భారత దేశం ఆధ్యాత్మిక ప్రదేశం. అడుగడుగునా గుడి ఉంది.. దేవుళ్ళను పూజించే సంప్రదాయం ఉంది. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కొలువైన దేవుళ్ళను దర్శించుకుని తమ మొక్కలను చెల్లించుకుంటారు. ఈ దేవాలయాలు ఎన్నో రహస్యాలతో, అందమైన శిల్పాలతో, చరిత్రను తెలియజేప్పేవిగా ఉంటాయి. దీంతో ఇలాంటి దేవాలయాలను చూడాలని చాలా మంది కోరుకుంటారు. కానీ కొన్ని దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది. ఈ దేవాలయాలలో హిందువులు తప్ప అన్యమతస్థులు ప్రవేశించడం నిషేధం. అటువంటి పరిస్థితిలో ఆ ప్రసిద్ధ దేవాలయాలు ఏవో తెలుసుకుందాం..
Updated on: Mar 24, 2025 | 9:11 AM

భారతదేశంలో అనేక దేవాలయాలు వాటి నమ్మకాల కారణంగా వార్తల్లో నిలిచి ఉన్నాయి. కొన్ని అలయలల్లో దాగి ఉన్న రహస్యాలను నేటికీ ఎవరూ చేధించలేకపోయారు. ఈ దేవాలయాలతో పాటు, కొన్ని దేవాలయాలు చాలా కఠినమైన నియమాలు, నిబంధనలు కలిగి ఉన్నాయి. దేవాలయంలో ప్రవేశించదానికి.. భక్తులు ధరించే దుస్తుల విషయంలో నిబంధనల నుంచి రకరకాల నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే ఆలయ ప్రాంగణంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉన్న దేవాలయాలు చాలా ఉన్నాయి. ఈ దేవాలయాలలోకి హిందువులు కానివారికి లేదా అన్యమతస్థుల ప్రవేశానికి అనుమతి లేదు. హిందువులు కాని వారి ప్రవేశం నిషేధించబడిన దేవాలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

తిరుపతి వెంకటేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ : కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామీ కొలువైన క్షేత్రం తిరుమల. ఇది దేశంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయం. హిందూ మతస్తులు కాకుండా ఇతర మతాలకు చెందిన వ్యక్తులు ఈ ఆలయంలోకి ప్రవేశించడం నినిషేధం. శ్రీవారి ఆలయంలో ఇతర మతాల వారు ప్రవేశించాలనుకుంటే.. వారు వెంకటేశ్వర స్వామిపై తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ.. ఒక అఫిడవిట్ ఇవ్వాలి.

గురువాయూర్ ఆలయం, కేరళ: కేరళలో ఉన్న గురువాయూర్ ఆలయం హిందూ మతస్తులకు విశ్వాస కేంద్రంగా ఉంది. ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది. ఇతర మతాల వారు ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఈ ఆలయ ప్రధాన దైవం బాలా గోపాలుడు. కన్నయ్య ను గురువాయురప్పన్ అని పిలుస్తారు. ఈ ప్రదేశం శ్రీకృష్ణుడు, విష్ణువు నివాసంగా పరిగణించబడుతుంది. దీనిని ఇలలో వైకుంఠం, దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు.

పద్మనాభస్వామి ఆలయం, కేరళ: ఈ విష్ణువు ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇది కేరళలోని చారిత్రాత్మక ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం గురించిన వివరణ పురాణ గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ట్రావెన్కోర్ కాలం నాటి రాజులు, మహారాజులు నిర్మించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు భారతదేశం, విదేశాల నుంచి ఇక్కడికి వస్తారు. అయితే స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం అన్య మతస్తులకు ఉండదు. హిందువులు కాని వారిని ఆలయంలోకి అనుమతించరు.

జగన్నాథ ఆలయం, పూరి: ఈ ఆలయం విష్ణువు 8వ అవతారమైన శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది. జగన్నాథ ఆలయం భువనేశ్వర్ సమీపంలోని పూరి నగరంలోని బంగాళాఖాతంలో సమీపంలో ఉంది. ఈ ఆలయంలోకి కూడా హిందువులను తప్ప మరెవరినీ అనుమతించరు. ఆలయ ద్వారం దగ్గర ఒక ఒక సైన్ బోర్డు ఉంటుంది. ఈ బోర్డ్ లో "సనాతన హిందువులు మాత్రమే ఇక్కడకు ప్రవేశించడానికి అనుమతి" అని రాసి ఉంటుంది. ఇది మాత్రమే కాదు హిందువులు కాని వారితో సంబంధాలు ఉన్న వ్యక్తులు కూడా ఈ ఆలయంలో అడుగు పెట్టడానికి.. జగన్నాథుని దర్శించుకోవడానికి అనుమతి లేదు. 1984 సంవత్సరంలో అప్పటి భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కూడా ఈ ఆలయంలో అడుగు పెట్టడానికి అనుమతించబడలేదు ఎందుకంటే ఆమె భర్త వేరే మతానికి చెందినవాడు.

లింగరాజ ఆలయం, భువనేశ్వర్ ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లో నిర్మించిన లింగరాజ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. అత్యంత పురాతనమైనది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తారు. అయితే హిందూ మతానికి చెందిన వారు మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశించగలరు. ఈ ఆలయ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఈ ఆలయానికి సుదూర పాశ్చాత్య దేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. అయితే 2012 సంవత్సరంలో ఒక విదేశీ పర్యాటకుడు ఇక్కడికి వచ్చి ఆలయ ఆచారాలకు భంగం కలిగించాడు. అప్పటి నుంచి ఆలయ ట్రస్ట్ బోర్డు ఈ ఆలయంలోకి హిందువులు కాని వారి ప్రవేశాన్ని నిషేధించింది.

కపాలీశ్వర ఆలయం, చెన్నై తమిళనాడులోని చెన్నైలో ఉన్న కపాలీశ్వర ఆలయం 7వ శతాబ్దంలో ద్రావిడ నాగరికత కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయానికి శివుడి పెట్టడం వెనుక ఒక బలమైన ఆధ్యాత్మిక నమ్మకం ఉంది. ఆ ఆలయం పేరును విడదీసినప్పుడు..ఈ ఆలయానికి కపాల (తల) ..ఈశ్వర (శివునికి మారుపేరు) అనే పదాల నుంచి ఈ ఆలయానికి కపాలీశ్వర పేరు వచ్చింది. ఈ ఆలయంలోకి కూడా హిందువులు తప్ప మరే మతానికి చెందిన పర్యాటకులు ప్రవేశించడం నిషేధించబడింది.





























