Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Gochar 2025: త్వరలో శనీశ్వరుడు వెండి పాదంతో సంచారం.. ఈ 3 రాశుల వారిపై డబ్బుల వర్షం

వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు త్వరలో మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మార్చి 29 2025 నాడు శని మీన రాశిలోకి సంచరించటం వల్ల అన్ని రాశుల వారి జీవితం పైన ప్రభావం పడుతుంది. మీన రాశిలో కొన్ని రాశుల్లో శనీశ్వరుడు వెండి పాదాలపై నడుస్తాడు. దీని కారణంగా ఈ రాశులకు చెందిన వ్యక్తులు కెరీర్ , వ్యాపారంతో సహా ప్రతి రంగంలో ప్రయోజనాలను పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం..

Shani Gochar 2025: త్వరలో శనీశ్వరుడు వెండి పాదంతో సంచారం.. ఈ 3 రాశుల వారిపై డబ్బుల వర్షం
Saturn Transit With Silver Paya
Follow us
Surya Kala

|

Updated on: Mar 25, 2025 | 7:07 AM

హిందూ మతంలో శనీశ్వరుడిని కర్మ ప్రదాత, న్యాయ దేవుడు అని పిలుస్తారు. జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడిని అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. శనీశ్వరుడు ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. శనీశ్వరుడు అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. వేదం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 29 చాలా ముఖ్యమైన రోజు కానుంది. ఈ రోజున, శని దేవుడి రాశిని మార్చుకోనున్నాడు.

శనీశ్వరుడు మీన రాశిలోకి అడుగు

మార్చి 29వ తేదీన శనీశ్వరుడు తన రాశిని మార్చుకుని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మీన రాశి దేవ గురువు బృహస్పతి అధిపతి. శనీశ్వరుడు మొత్తం నాలుగు పాదాలతో నడుస్తాడు. బంగారం, వెండి, రాగి, ఇనుము పాదాలలో నడుస్తాడు. మీన రాశిలో శనీశ్వరుడు ప్రవేశించడంతో.. ఈ మూడు రాశుల్లో ఆయన వెండి పాదంతో నడుస్తాడు. శనీశ్వరుడు వెండి పాదాలతో నడిస్తే ఈ రాశుల వ్యక్తుల విధి మారుతుంది. వీరు తమ వృత్తి , వ్యాపారంలో భారీ ప్రయోజనాలను పొందనున్నారు. 2025 సంవత్సరంలో శనీశ్వరుడు వెండి పాదంతో సంచరించే రాశులను గురించి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి వృషభ రాశి వారికి శని వెండి పాదంతో సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు పొందనున్నారు. ఎప్పటి నుంచో తిరిగి రాణి డబ్బును తిరిగి పొందనున్నారు. ఆదాయంలో కూడా పెరుగుదల ఉండవచ్చు. పెట్టుబడి నుంచి లాభాలు పొందనున్నారు. ఉద్యోగస్తులు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా లాభం పొందే అవకాశం ఉంది.

కన్య రాశి కన్య రాశి వారికి శని దేవుడు వెండి పాదాలతో నడవడం శుభప్రదం. ఈ కాలంలో కన్య రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మంచి ఆదాయం లభిస్తుంది. జీతం పెరగవచ్చు. ప్రమోషన్ రావచ్చు. వ్యాపారులు వ్యాపారంలో మంచి లాభాలను పొందవచ్చు. సమాజంలో గౌరవం లభించవచ్చు. ఈ సమయంలో వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

మీన రాశి శనీశ్వరుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో శనీశ్వరుడు వెండి పాదాలను ధరించి ఈ రాశిలోకి అడుగు పెట్టడం మీన రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో, మీన రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వీరు ఉద్యోగంలో పదోన్నతి , వ్యాపారంలో కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీన రాశి వారు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు