Saneeswaran Temple: మార్చి 29న శనీశ్వర సంచారంపై గందరగోళం.. తిరునల్లార్ శనీశ్వర ఆలయం సంచలన ప్రకటన
తెలుగు నెలల్లో చివరి రోజు పాల్గుణ మాసం అమావాస్య. ఈ అమావాస్య తిధి శనివారం రోజు రావడంతో ఈ రోజుకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఈ రోజు ఓ వైపు సూర్య గ్రహణం ఏర్పడనుందని.. మరోవైపు శనిశ్వర సంచారం జరగనుందని కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు. తాజాగా శనిశ్వర సంచారంపై తమిళనాడులోని ప్రముఖ శనీశ్వర ఆలయ పరిపాలన అధికారులు సంచలన ప్రకటన చేసింది. అందరూ చెబుతున్నట్లుగా మార్చి 29 న శని సంచారం ఉండదని ప్రకటించింది.

తమిళనాడు తిరునల్లార్ శనీశ్వర భగవాన్ ఆలయ పరిపాలన సిబ్బంది శనీశ్వర సంచారంపై సంచలన ప్రకటన చేసింది. మార్చి 29, 2025న శనీశ్వర సంచారము ఉండదని ప్రకటించడంతో ఆధ్యాత్మిక ప్రియుల్లో గందరగోళం నెలకొంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వర సంచారము చాలా ముఖ్యమైన గ్రహ సంఘటనగా ప్రసిద్ధి చెందింది. నవ గ్రహాలన్నిటిలో శనీశ్వరుడు మాత్రమే మంద గమనుడు.. నెమ్మదిగా కదులుతాడు. దీంతో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. కనుక ఒక రాశిలో ఎక్కువ సమయం గడిపే గ్రహం శనీశ్వరుడు. అంటే శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ఈ శనీశ్వర సంచారంతో ఏలినాటి శని, అర్థాష్టమ శని మొదలవుతుంది.
శని సంచారము అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశులకు సానుకూల ప్రభావాన్ని చూపిస్తే.. మరికొన్ని రాషులపై ప్రతికూల ప్రభావాన్ని కలిగితుంది. కనుక జ్యోతిష్యాన్ని, ఆధ్యాత్మికతను విశ్వసించే వారిలో శని సంచారం తీవ్ర భయాన్ని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో.. 2025 మార్చి 29న శని సంచారము జరుగుతుందని ఒక వార్త వినిపిస్తోంది.
ఆ రోజు.. రాత్రి 9:44 గంటలకు.. హిందూ క్యాలెండర్ ప్రకారం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారంతో మొత్తం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది.. అందుకు పరిహారాలు ఇవే అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం అవుతున్న నేపధ్యంలో ఇప్పుడు తిరునల్లార్ శనీశ్వర ఆలయ సిబ్బంది చేసిన ప్రకటనతో తీవ్ర గందర గోళం నెలకొంది.
కారైకల్ జిల్లా తిరునల్లార్‌లోని ప్రసిద్ధ శనీశ్వర ఆలయ పరిపాలన సిబ్బంది అకస్మాత్తుగా మార్చి 29, 2025న శని సంచారము ఉండదని ప్రకటించింది. అంతేకాదు వాక్య పంచాంగం ప్రకారం.. శనిశ్వర సంచారము 2026లో మాత్రమే జరుగుతుందని వెల్లడించింది. ఈ ప్రకటన విన్న తర్వాత పలువురు ఇప్పటివరకు శనిశ్వర సంచారం అంటూ విడుదలైన సమాచారం దేని ఆధారంగా అంటూ ప్రశ్నిస్తున్నారు.
సూర్యగ్రహణం
2025 మార్చి 29న సూర్యగ్రహణం సంభవించనుంది. అదే రోజున శని సంచరిస్తాడని చెబుతున్నారు.. అంతేకాదు ఆ రోజున, 12 రాశుల వారు కొన్ని నియమాలను పాటించాలని.. పరిహారాలు చేయాలనీ చెబుతున్నారు. మరి ఇప్పుడు సడెన్ గా శని సంచారం లేదని ప్రకటించడంతో ఏది నిజం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది నిజమో తెలియజేయమంటూ సోషల్ మీడియా ద్వారా అభ్యర్దిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు