Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?

సంఖ్యాశాస్త్రం ప్రకారం మన జన్మతేదీ మన వ్యక్తిత్వాన్ని, సంబంధాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మూలసంఖ్య 2 కలిగిన వారికి ఎవరితో బలమైన బంధం ఏర్పడుతుందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సంఖ్యకు సంబంధించి ఉత్తమ జీవన భాగస్వాములు ఎవరో, వారి వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
Luckiest Numbers
Follow us
Prashanthi V

|

Updated on: Mar 25, 2025 | 6:53 PM

సంఖ్యాశాస్త్రం ప్రకారం మన జన్మతేది ఆధారంగా మన లక్షణాలు, సంబంధాలు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయాలను తెలుసుకోవచ్చు. ఇందులో నెలలో 2, 11 లేదా 20 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 2గా ఉంటుంది. ఈ మూలసంఖ్య ఆధారంగా మన వ్యక్తిత్వం, జీవనశైలి, సంబంధాలను అంచనా వేయడం జరుగుతుంది. అయితే మూలసంఖ్య 2 వారికి అత్యుత్తమ జీవిత భాగస్వామి ఎవరవుతారు..? వారితో గాఢమైన బంధం కలిగే వారు ఎవరు..? అనేదాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మూలసంఖ్య 1

జన్మతేది 1, 10, 19, 28 అయిన వారి మూలసంఖ్య 1గా ఉంటుంది. వీరి గ్రహాధిపతి సూర్యుడు. ఈ సంఖ్యకు చెందిన వారు స్వతంత్ర స్వభావం కలిగినవారు, కొంచెం గట్టి స్వభావం కలిగి ఉంటారు. కానీ వారు మూలసంఖ్య 2 వారితో చాలా అనుబంధాన్ని పెంచగలరు. వీరు నమ్మకద్రోహం చేయకుండా నిస్వార్థంగా ప్రేమించే స్వభావం కలిగి ఉంటారు.

మూలసంఖ్య 2

మూలసంఖ్య 2 సంఖ్య కలిగిన వ్యక్తులకు తమతో సమానమైన సంఖ్య ఉన్నవారితో ఎంతో మంచి సంబంధం ఏర్పడుతుంది. దీనికి ప్రధాన కారణం వారి ఆలోచన విధానం ఒకేలా ఉండడం. ఒకరి భావాలను మరొకరు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అందువల్ల, మూలసంఖ్య 2, మూలసంఖ్య 2 కలిగిన వారికీ ఒక బలమైన బంధం ఏర్పడే అవకాశముంది.

మూలసంఖ్య 4

జన్మతేది 4, 13, 22 అయినవారి మూలసంఖ్య 4గా ఉంటుంది. వీరి గ్రహాధిపతి రాహువు. వీరు ధైర్యం, నిబ్బరంతో జీవించే స్వభావం కలిగినవారు. వీరు మూలసంఖ్య 2 వ్యక్తులతో ఒక గొప్ప అనుబంధాన్ని ఏర్పరచుకోగలరు. వీరి సంబంధం బలమైనదిగా ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.

మూలసంఖ్య 6

జన్మతేది 6, 15, 24 అయినవారి మూలసంఖ్య 6గా ఉంటుంది. వీరి గ్రహాధిపతి శుక్రుడు. వీరు ప్రేమకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. మూలసంఖ్య 2 వ్యక్తులతో వీరు మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుని, బలమైన సంబంధాన్ని కొనసాగించగలుగుతారు.

మూలసంఖ్య 7

జన్మతేది 7, 16, 25 కలిగినవారి మూలసంఖ్య 7గా ఉంటుంది. వీరి గ్రహాధిపతి కేతువు. వీరు ఆధ్యాత్మికతలో మక్కువ చూపించే వారు. వీరు మూలసంఖ్య 2 వ్యక్తులతో మంచి స్నేహం చేసి ఒకరినొకరు సులభంగా అర్థం చేసుకునే విధంగా ఉంటారు. వీరి మధ్య ఉన్న బంధం చాలా బలంగా ఉండే అవకాశం ఉంది.

సంఖ్యాశాస్త్రం ప్రకారం మూలసంఖ్య 2 వారు పై సంఖ్యల వ్యక్తులతో మంచి జీవన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవచ్చు. ప్రతి మూలసంఖ్య కూడా వేర్వేరు లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ.. సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడం ద్వారా ఒక బలమైన, శాశ్వతమైన బంధం నిర్మించుకోవచ్చు.