Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi Special: ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్టుని స్వీట్ షాప్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా చేసుకోండి.. రెసిపీ మీ కోసం

దక్షిణాది స్పెషల్ తీపి వంటకం బొబ్బట్టు. ఉగాది వస్తుందంటే చాలు బొబ్బట్లు కోసం పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తారు. అవును పండగల్లోనైనా, శుభకార్యాల్లోనైనా సంప్రదాయ తీపి వంటకాల్లో అగ్రస్ధానం బొబ్బట్టుది అని చెప్పవచ్చు. బక్ష్యాలు , బచ్చాలు , బొబ్బట్లు, పొలేలు అంటూ వివిధ ప్రాంతాల్లో వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. అయితే పిల్లలు మాత్రం స్వీట్ చపాతీలు అని పిలుచుకుంటారు. ఈ ఉగాది స్పెషల్ గా బొబ్బట్టుని ఇంట్లోనే తయారు చేసుకోండి..

Ugadi Special: ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్టుని స్వీట్ షాప్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా చేసుకోండి.. రెసిపీ మీ కోసం
Nethi Bobbatlu Recipe
Follow us
Surya Kala

|

Updated on: Mar 26, 2025 | 11:28 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో మాత్రమే కాదు.. అసలు దక్షినాది ప్రజలు బొబ్బట్టుని చాలా ఇష్టంగా తింటారు. వయసుతో సంబంధం లేకుండా ఇష్టంగా తినే ఈ బొబ్బట్టుని ఒకొక్క ప్రాంతలో ఒకొక్క రకంగా తయారు చేస్తారు. అదే విధంగా ఒకొక్క పేరుతో పిలుస్తారు. ముఖ్యంగా పండగలూ పబ్బాలు, పూజలు పునస్కారాలు , విందులు వినోదాలు ఇలా కార్యక్రమంలో నైనా తన స్ధానాన్ని పదిలం చేసుకుంది బొబ్బట్టు. రకరకాలుగా తయారు చేసుకునే బొబ్బట్టు తిన్న వెంటనే మెత్తగా వెన్నెలా కారిపోతుంది. నెయ్యి వేసుకుని వేడి వేడిగా బొబ్బట్టు తినే వచ్చే మజా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రోజు ఉగాది స్పెషల్ తీపి వంటకంగా మెత్తటి కమ్మని బొబ్బట్టుని ఇంట్లోనే తయారు చేసుకోండి. రెసిపీ మీ కోసం..

బొబ్బట్టు తయారీకి కావాల్సిన పదార్ధాలు

శనగపప్పు – 1/2 కప్పు

బ్రౌన్ షుగర్ – 1 కప్పు

ఇవి కూడా చదవండి

యాలకుల పొడి- కొంచెం

ఉప్పు- కొంచెం

పసుపు- చిటికెడు

నెయ్యి- పావు కప్పు

గోధుమపిండి – 1 కప్పు

మైదాపిండి – 1 కప్పు

నీరు –

తయారీ విధానం: ముందుగా శనగపప్పుని ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో కప్పు గోధుమ పిండి, కప్పు మైదా పిండి వేసి బాగా మిక్స్ చేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం కొంచెం నీరు పోసి .. ఈ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం లూజుగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి కొంచెం, నూనె కొంచెం వేసి.. పిండిని బాగా కలిపి.. పిండిపై నూనె రాసి ఒక పక్కకు పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని సుమారు రెండు గంటల పాటు నానిన శనగపప్పుని ఆ కుక్కర్ లో వేయాలి. శనగ పప్పు ఉడికించడానికి సరిపడా నీరు పోసి మూత పెట్టి విజిల్ పెట్టాలి. తర్వాత శనగ పప్పుని ఆరు విజిల్స్ వచ్చేటంత వరకూ ఉడికించాలి. ఇపుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ విజిల్ తీసి శనగ పప్పులోని ఎక్కువ నీరు తీసుకుని ఇప్పుడు ఆ పప్పుని మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి.. అందులో మెదిపిన శనగ పప్పు వేసి.. కప్పు బ్రౌన్ షుగర్ వేసి పప్పు గడ్డిపడే వరకూ ఉడికించుకోవాలి. పప్పు ఉడికి గట్టి పడుతున్న సమయంలో అందులో కొంచెం యాలకులపొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. పూర్ణం గడ్డిపడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణం పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన పూర్ణాన్ని ఉండలు చేసి పక్కకు పెట్టుకోవాలి.

ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న గోధుమ పిండి, మైదా పిండి మిశ్రమం ఉండగా తీసుకుని దాని మధ్యలో పూర్ణం ఉండలు పెట్టుకుని పెద్ద సైజు ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు బట్టర్ పేపర్స్ లేదా.. అరిటాకు తీసుకుని దాని మీద నెయ్యి రాసి పూర్ణం పెట్టిన పిండి ఉండని పెట్టి.. బొబ్బట్టుగా చేతితో ఒత్తుకోవాలి. చపాతీ కర్రతో చపాతీగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి.. వేడి ఎక్కిన తర్వాత నెయ్యి వేసి రెడీ చేసుకున్న మీడియం మంట మీద బొబ్బట్టుని రెండు వైపులా కాల్పుచుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ శనగ పప్పు పూర్ణం బొబ్బట్టు రెడీ..

తరువాత బొబ్బట్లు చేసుకోవడానికి రెండు బట్టర్ పేపర్స్ తీసుకొని రెండిటికి ఒక సైడ్ కాస్త నెయ్యి రాసి పెట్టుకోవాలి. మైదాపిండి మిశ్రమం తీసుకొని చేతితో కాస్త పరిచి మధ్యలో పూర్ణం పేటి మల్లి ఉండలాగా చేసి రెండు బట్టర్ పేపర్స్ మధ్యలో పేటి చేతితో కానీ చపాతీ కర్రతోగాని చపాతీ ల చేసుకోవాలి. తరువాత పెనం పెట్టుకొని చేసుకున్న బొబ్బట్టును రెండు పక్కల సమానంగా మీడియం ఫ్లేమ్ లో నెయ్యి వేసి కాల్చుకుంటే ఎంతో రుచికరమైన బొబ్బట్లు రెడీ. మీరందరు తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..