Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

L2 Empuraan mania: ఎంపురాన్ రిలీజ్.. స్టూడెంట్స్‌కి సెలవు ప్రకటించిన కాలేజీ.. టికెట్స్ గిఫ్ట్.. ఎక్కడంటే..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజా సినిమా 'ఎల్ 2: ఎంపురన్ విడుదల కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. 'లూసిఫర్' సినిమాకు సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా విడుదల కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంపురాన్ విడుదలను పురస్కరించుకుని ఏకంగా ఓ కాలేజీ యాజమాన్యం మార్చి మార్చి 27న సెలవు ప్రకటించింది. అంతేకాదు స్టూడెంట్స్ కు టికెట్స్ ను ప్రీగా ఇచ్చింది.

L2 Empuraan mania: ఎంపురాన్ రిలీజ్.. స్టూడెంట్స్‌కి సెలవు ప్రకటించిన కాలేజీ.. టికెట్స్ గిఫ్ట్.. ఎక్కడంటే..
L2 Empuraan Mania
Follow us
Surya Kala

|

Updated on: Mar 25, 2025 | 10:52 AM

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కొత్త సినిమా ‘ఎల్2: ఎంపురాన్’ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా బెంగళూరులోని ఒక ప్రఖ్యాత కళాశాల మార్చి 27న సెలవు ప్రకటించింది. అంతే కాదు సినిమా పట్ల ,సూపర్ స్టార్ పట్ల తమ ప్రేమను తెలియజేస్తూ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు సినిమా టిక్కెట్లను ఉచితంగా ఇచ్చింది. బెంగళూరులోని గుడ్ షెపర్డ్ కాలేజీ తమ స్టూడెంట్స్ కు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. “లైట్స్, కెమెరా, హాలిడే! అభిరుచి, అభిమానం కలిస్తే, చరిత్ర సృష్టించబడుతుందని పేర్కొంది. కాలేజీ యాజమాన్యం తమ స్టూడెంట్స్ కోసం మోహన్ లాల్ ప్రతిభను .. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వాన్ని గౌరవించటానికి ఎంపురాన్ మూవీ రిలీజ్ సందర్భంగా ఒక స్పెషల్ షోను ఏర్పాటు చేశారు.

కాలేజీ చైర్మన్ తనకు మోహన్ లాల్ పై ఉన్న ప్రేమని తెలియజేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. మూవీటైమ్ సినిమాస్, వైజిఆర్ మాల్, రాజరాజేశ్వరి నగర్‌లోని విద్యార్థులందరికీ ఉదయం 7 గంటల షోను యాజమాన్యం బుక్ చేసిందని ఓ సర్క్యులర్‌లో తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

లుసాఫిర్ ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎంపురాన్ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఇది 2019లో రిలీజైన లూసిఫర్ కి ప్రీక్వెల్. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

మోహన్‌లాల్‌తో పాటు, పృథ్వీరాజ్, మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ కూడా ఎంపురాన్‌లో నటిస్తున్నారు. వీరి పాత్రలు లూసిఫెర్ లోని పాత్రలనే తిరిగి పోషించినట్లు తెలుస్తోంది.

ఎంపురాన్ సినిమా హిట్ అంటూ ఇప్పటికే ట్రేడ్ విశ్లేషకులు ప్రకటించారు ఎందుకంటే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 12.85 కోట్లు వసూలు చేసింది. లూసిఫర్ .. ఎంపురాన్ సినిమాలు త్రయంలో భాగమని, త్రయం.. మూడవ.. చివరి భాగం అని.. ఈ సినిమా వివరాలను గోప్యంగా ఉంచామని నిర్మాతలు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.