ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకలు వేస్తూ కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా..
సినిమా హీరోయిన్స్ నిత్యం షూటింగ్స్‌తో, సోషల్ మీడియాతో బిజీగా గడుపుతూ ఉంటారు. అలాగే ఎప్పుడూ ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తూ ఉంటారు. షూటింగ్స్ కోసం, వెకేషన్స్ కోసం నిత్యం ఎయిర్ పోర్ట్ కనిపిస్తూనే ఉంటారు. తాజాగా ఓ టాలీవుడ్ నటి ఎయిర్ పోర్ట్ లో అరుస్తూ.. కేకలు వేస్తూ కనిపించింది. ఇంతకూ ఆమెకు ఏమైంది.?

సినిమా సెలబ్రెటీలు నిత్యం ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తుంటే ఉంటారు. సినిమా షూటింగ్స్ కోసం లేదంటే సినిమా ఈవెంట్స్ కోసం విదేశాలు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు చాలా మంది సెలబ్రెటీలకు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఎయిర్ పోర్ట్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం.. లేదా ఏదైనా అసౌకర్యం కలగడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఎయిర్ పోర్ట్ జరిగిన సంఘటనల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. తాజాగా ఓ టాలీవుడ్ నటి కూడా ఎయిర్ పోర్ట్ లో అరుస్తూ కేకలు వేస్తూ కనిపించింది. అయితే ఆమె ఎందుకు అలా కేకలు వేస్తూ కనిపించింది.. అసలు ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఇది కూడా చదవండి : బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది
తెలుగులో ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో మన్నార చోప్రా ఒకరు. ఆమె గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్. ఇక మన్నార్ చోప్రా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ సినిమాల్లో నటించింది. తెలుగులో ప్రేమ గీమ జాంత నై అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత సునీల్ జక్కన్న, సాయి ధరమ్ తేజ్ తిక్క సినిమాల్లో నటించింది. అలాగే రోగ్, సీత సినిమాలో నటించింది. ఇటీవలే తిరగబడరా సామి అనే సినిమాలో నటించింది.
ఇది కూడా చదవండి :టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే
ఇదిలా ఉంటే తాజాగా మన్నారా హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తుండగా ఊహించని సంఘటన జరిగింది. తనను విమానం ఎక్కకుండా సిబ్బంది అడ్డుకున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ” నేను ముంబై ఎయిర్‌పోర్ట్‌కి వచ్చినప్పటికీ జైపూర్‌కు వెళ్లే విమానంలో నన్ను ఎక్కనివ్వలేదు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది నాపై దురుసుగా ప్రవర్తించారు. నేను ఇక్కడే ఉన్నా కూడా నా పేరు పిలువలేదు. నేను ఇక్కడ బోర్డింగ్ గేట్ ముందే కూర్చున్నాను అయినా పిలవలేదు. దాంతో నేను విమానం ఎక్కలేకపోయాను. నేను వెళ్లి అడిగితే నాతో దురుసుగా ప్రవర్తించారు అని తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయంలోనూ ఇదే విమానయానసంస్థతో ఇలాంటి సంఘటనను ఎదుర్కొన్నాను అని వీడియోలో చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి :మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్.. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్‌కు తీసిపోదు..
View this post on Instagram
మన్నారా చోప్రా ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.