AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం లైఫ్‌లోనే ఓ మైలు రాయి.. ఆనందంలో తేలిపోతున్న ముద్దుగుమ్మ

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి బిజీగా ఉన్నాడు. రీసెంట్ డేస్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో సూపర్ హిట్ ఆ అందుకున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

Prabhas: ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం లైఫ్‌లోనే ఓ మైలు రాయి.. ఆనందంలో తేలిపోతున్న ముద్దుగుమ్మ
Prabhas
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2025 | 8:33 AM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా ఛాన్స్ వచ్చిందంటే హీరోయిన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రేంజే వేరు. గ్లోబల్ వైడ్ గా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. డార్లింగ్ సినిమా రిలీజ్ అవుతుందంటే మనతో పాటు విదేశీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలను లైనప్ చేశారు. సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు అరడజను సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ప్రభాస్ త్వరలో రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఆతర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వలో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.

వీటితోపాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా, సలార్ 2, కల్కి 2లతో పాటు మరో సినిమా కూడా ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ తాజాగా ప్రభాస్ తో నటించడం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రభాస్ తో సినిమా చేయడం తన లైఫ్ లో ఓ మైలు రాయి అని చెప్పుకొచ్చింది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా.? తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు టాలీవుడ్ వైపు అడుగులేస్తున్న మాళవిక మోహనన్.

ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది రజినీకాంత్, దళపతి విజయ్, ధనుష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టనుంది. గతంలో ఈ భామ ప్రభాస్ గురించి అతని మంచితనం గురించి అలాగే ఆయన షూటింగ్ కు పంపించే ఫుడ్ గురించి తెలిపింది. తాజాగా ప్రభాస్ తో నటించడం జీవితంలో ఓ మైలు రాయి అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..