- Telugu News Photo Gallery Cinema photos Tamannaah bhatia shares beautiful photos in a pink saree while promoting the movie Odela 2
గులాబీ అందాలన్నీ ఈ అమ్మడులోనే ఉన్నాయేమో.. పింక్ చీరలో మిల్కీ బ్యూటీ
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తాజాగా ఈ చిన్నది పింక్ కలర్ శారీలో చూడటానికి చాలా ముద్దుగా కనిపించి అందరినీ మాయ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Mar 24, 2025 | 8:44 AM

అందాల ముద్దుగుమ్మ సీనియర్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు టాలీవుడ్‌నే షేక్ చేసిన ఈ బ్యూటీకి ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ కరువు అయ్యాయనే చెప్పాలి.

దీంతో ఈ మద్దుగుమ్మ బాలీవుడ్ చెక్కేసి అక్కడ వరస వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.అంతే కాకుండా తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఇక చాలా రోజుల తర్వాత ఈ బ్యూటీ తెలుగులో సందడి చేయడానికి రెడీ అయ్యింది.

ఓదెల 2లో ఈ అమ్మడు అఘోరీ పాత్రలో నటిస్తుంది. అయితే త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది. దీంతో సినిమా టీం ప్రమోషన్స్ మొదలు పెట్టాయి.ఈ క్రమంలోనే ఓదెల 2 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా చీరలో అదిరిపోయింది.

ఓదెల2 ఏప్రిల్ 17న విడుదల అవుతుందని చెబుతూ..పింక్ శారీలో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో అచ్చం అలనాటి హీరోయిన్‌లా చూడటానికి చాలా ముద్దుగా ఉంది ఈ చిన్నది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక బాలీవుడ్ నిర్మాత విజయ్ వర్మతో లవ్‌లో ఉన్న ఈ చిన్నది త్వరలోనే వివాహం చేసుకోబోతుంది అంటూ అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.కానీ ఈ మధ్య వీరికి బ్రేకప్ అయినట్లు అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.





























