Ram Charan: సస్పెన్స్‌లో రామ్ చరణ్ నయా మూవీ ఆర్సీ 16 రిలీజ్.. కారణం ఇదేనా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా బుచ్చి బాబు దర్శకత్వంలో RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో.. స్పోర్ట్స్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16 పై పూర్తి దృష్టి పెట్టాడు. బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చివరిగా వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపొయింది. టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యింది. రామ్ చరణ్ తో పాటు ఈ సినిమాలో చాలా మంది నటీ నటులు కనిపించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. విడుదలకు ముందు ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా విడుదల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఆర్సీ 16 విషయానికొస్తే..
ఆర్సీ 16 సినిమా ఒక గ్రామం నేపథ్యంలో జరిగే స్పోర్ట్స్ డ్రామా అని చెబుతున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు వంటి నటులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆర్సీ 16 విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం 2025 విడుదల నుండి మార్చి 2026 కి వాయిదా వేయబడుతుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ RC16 చిత్రం పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ ధరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. అయితే OTT ప్లాట్‌ఫామ్ ఈ చిత్రాన్ని 2026 వరకు వాయిదా వేయాలని కోరినట్టు టాక్. దాంతో సినిమాను 2026కు వాయిదా వేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.