Singer Damini : తెలుగు గాయకుల పరువు తీస్తున్నావ్.. సింగర్ దామినిపై నెటిజన్ సీరియస్..
సింగర్ దామిని.. తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక పాటలు పాడి శ్రోతలకు దగ్గరైంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా మరింత పాపులర్ అయ్యింది. కానీ నిత్యం సోషల్ మీడియాలో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ పై ఓ నెటిజన్ సీరియస్ అయ్యాడు.

తెలుగు ప్రజలకు సుపరిచితమైన సింగర్ దామిని. బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా మరింత పాపులర్ అయ్యింది. హౌస్ లో ఉన్నది తక్కువ రోజులే అయిన తన ఆట తీరుతో ఫేమస్ అయ్యింది. కానీ ఈ షో ద్వారా ఒకింత నెగిటివిటీని మూటగట్టుకుంది. ముఖ్యంగా హౌస్ లో ఆమె డ్రెస్సింగ్ పై విమర్శలు వచ్చాయి. అలాగే ఎక్కువ సమయం వంటగదిలో గడపడంతో వంటలక్క అనే బిరుదు కూడా ఇచ్చేశారు. హౌస్ లో అటు పాజిటివ్.. ఇటు నెగిటివిటీ రెండింటీని సంపాదించుకున్న దామిని.. తక్కువ సమయంలోనే బయటకు వచ్చేసింది. ఎలిమినేట్ అయిన తర్వాత తన పై వచ్చిన ట్రోల్స్ కు గట్టిగానే కౌంటరిచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
తన ప్రైవేట్ సాంగ్స్, ఆల్బమ్స్ చేస్తూ బిజీగా ఉన్న దామిని.. తాజాగా తన ఇన్ స్టాలో ఓ క్రేజీ ఫోటోషూట్ షేర్ చేసింది. అందులో హార్మొనియం పెట్టె పెట్టుకుని చీరలో మరింత అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ నెట్టింట వైరలవుతుండగా.. కొందరు నెటిజన్స్ ఆమె తీరుపై సీరియస్ అవుతూ కామెంట్స్ చేశారు. తెలుగు గాయకుల పరువు తీస్తున్నావ్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అందుకు తన స్టైల్లో రిప్లై ఇచ్చింది దామిని. వాళ్లేం అనలేదు.. నువ్వే అంటున్నావ్.. తెలుగు గాయకులంతా బానే ఉన్నారు అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.
తెలుగులో అనేక సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది దామిని. అలాగే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. బాహుబలి సినిమా పచ్చబొట్టేసినా పాటతో ఆమె పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ వచ్చింది. రాజమండ్రికి చెందిన దామిని.. చిన్నప్పటి నుంచే శాస్త్రీయ సంగీతం నెర్చుకుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..