Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేనీ కన్నుమూత.. ప్రియ శిష్యుడిని ఏమి కోరారంటే..

సినీ పరిశ్రమలో వరస విషాద సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోలీవుడ్ నటుడు, మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సేనీ (60) కన్నుమూశారు. లుకేమియాతో బాధపడుతున్న ఆయన గత కొంత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు తుదిశ్వాస విడిచారు. హుస్సేనీ మృతికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సహా పలువురు సినీ, క్రీడా, మార్షల్ ఆర్ట్స్ కి చెందిన వారు తమ సంతాపం తెలిపారు.

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేనీ కన్నుమూత.. ప్రియ శిష్యుడిని ఏమి కోరారంటే..
Shihan Hussaini Passed Away
Follow us
Surya Kala

|

Updated on: Mar 25, 2025 | 12:18 PM

షిహాన్ హుస్సేనీ మార్షల్ ఆర్ట్స్ గురువు మాత్రమే కాదు నటుడు కూడా.. అనేక తమిళ సినిమాల్లో నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సహా అనేక మంది హుస్సేనీ మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ షిహాన్ హుస్సేనీ దగ్గరే శిక్షణ తీసుకుంటూ పవన్ కళ్యాణ్ కరాటే, కిక్ బాక్సింగ్‌లో నిపుణుడయ్యారు. బ్లాక్ బెల్ట్ అందుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు షిహాన్ హుస్సైనీ మరణ వార్త విని తాను తీవ్ర ఆవేదనకు లోనయ్యానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతేకాదు తాను ఆయన వద్దే కరాటే శిక్షణ పొందానని తనకు గురువు గారైన షిహాన్ హుసైనికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మార్షల్ ఆర్ట్స్ గురు హుస్సైనీ అనారోగ్యంతో బాధపడుతున్నారని తనకు నాలుగు రోజుల కిందటే తెలిసిందని.. వెంటనే చెన్నైలోని తన ఫ్రెండ్స్ కు చెప్పి… మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకుని వేల్లలనుకున్నట్లు.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుండగా ఇంతలో ఈ దారుణం జరిగిపోయిందని చెప్పారు పవన్ కళ్యాణ్. ఈ నెల 29వ తేదీన చెన్నై వెళ్ళి హుస్సైనీ పరామర్శించాలని నిర్ణయించుకొన్నాను. ఇంతలో దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం. హుస్సైనీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. హుస్సైనీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చెప్పారు.

చెన్నైకి చెందిన షిహాన్ భారతీయ కరాటే నిపుణుడుగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. 60 ఏళ్ల షిహాన్ గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ మాత్రమే కాదు అర్చరీ గురువు కూడా..ఆయన 1986 లో బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, రేవతి జంటగా తెరక్కిన ‘పున్నగై మన్నన్ సినిమా ద్వారా నటుడుగా వెండి తెరపై అడుగు పెట్టాడు. రజనీకాంత్ చిత్రాలైన వేలైకారన్ (1987) , బ్లడ్‌స్టోన్ (1988), శరత్‌కుమార్ వేదన్ (1993) లతో పాటు.. తమ్ముడు సినిమా తమిళ రీమేక్ లో కిక్ బాక్సింగ్ నేర్పించే గురువుగా కూడా నటించారు. చివరిగా విజయ్ సేతుపతి, నయనతార, సమంత నటించిన విఘ్నేష్ శివన్ ల కాతు వాకులా రెండు కాదల్ (2022) లో నటించాడు.

తనకు బ్లడ్ క్యాన్సర్ అని చివరి స్టేజ్ అని తెలిసిన తర్వాత హుస్సైనీ తన శిష్యులైన పవన్ కళ్యాణ్, విజయ్ లకు చివరి కోరికలను తెలియజేశారు. తన శిక్షణా కేంద్రం ఉన్న భవనాన్ని తన ప్రియ శిష్యుడైన పవన్ కళ్యాణ్ దానిని మార్షల్ ఆర్ట్స్ కేంద్రంగా కొనసాగించాలని నేను కోరుకుంటున్నానని చెప్పారు, అంతేకాదు విజయ్‌కి తమిళనాడులోని ప్రతి ఇంట్లో కనీసం ఒక ఆర్చర్ ఉండేలా చూసుకోవాలని అభ్యర్ధించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.