Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రక్తహీనత సమస్యా.. బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి..

మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లతో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రోజు రోజుకీ అధికంగా ఉన్నారు. ముఖ్యంగా బలమైన ఆహారం తీసుకోకపోవడం వలన రక్త హీనత తో బాధపడేవారి సంఖ్య అధికంగా ఉంది. హిమోగ్లోబిన్ సమస్యను సహజంగా అధిగామించాలనుకుంటే బాబా రామ్‌దేవ్ చెప్పిన చిట్కాలను అనుసరించవచ్చు. ఈ పరిహారంతో కేవలం 7 రోజుల్లో ఫలితాన్ని పొందవచ్చు. ఈ రోజు ఆ నివారణ చర్యలు ఏమిటో తెలుసుకుందాం.

Health Tips: రక్తహీనత సమస్యా.. బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి..
Health Care Tips
Follow us
Surya Kala

|

Updated on: Mar 26, 2025 | 8:42 AM

రక్తహీనత అనేది ఒక సాధారణ సమస్య. చాలా సందర్భాలలో ఇది స్త్రీలను, పిల్లలను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత లేకపోవడం వలన అలసట, బలహీనత, తల తిరగడం, తలనొప్పి, చర్మం రంగు మారడం వంటి సమస్యలు వస్తాయి. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే.. అప్పుడు అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని బాబా రాందేవ్ చూపించాడు. ఆయన చెప్పిన విధంగా హిమోగ్లోబిన్ పెంచడానికి సహజంగా లేదా ఆయుర్వేద పద్ధతులను అవలంబించాలి. తద్వారా శరీరానికి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పూర్తి పోషకాహారం లభిస్తుంది.

బాబా రామ్‌దేవ్ ఒక వీడియోలో హిమోగ్లోబిన్ పెంచడానికి ఒక గొప్ప సహజ నివారణ గురించి కూడా చెప్పారు. దీన్ని కేవలం 7 రోజులు చేస్తే ఫలితం కనిపిస్తుంది. ఆ వంటకం ఏమిటో.. దాని ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం.

బాబా రామ్‌దేవ్ వంటకం

బాబా రామ్‌దేవ్ దీనిని హిమోగ్లోబిన్ పెంచడానికి అద్భుతమైన జ్యూస్ గా అభివర్ణించారు. ఈ జ్యూస్ తయారు చేయడం కూడా చాలా సులభం. దీని కోసం మీకు దానిమ్మ, బీట్‌రూట్, అల్లం, ఉసిరి మాత్రమే అవసరం.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

View this post on Instagram

A post shared by Swami Ramdev (@swaamiramdev)

జ్యూస్ ఎలా తయారు చేయాలంటే

ముందుగా దానిమ్మ గింజలు తీసి.. తర్వాత క్యారెట్, బీట్‌రూట్, ఉసిరిని చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. అల్లం తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ లో వేసి.. కొంచెం నీళ్లు పోసి బాగా కలపండి. జ్యూస్ బాగా తయారైన తర్వాత.. దానిని వడకట్టి ఒక గ్లాసులో పోయాలి. అందులో నిమ్మరసం పిండి వెంటనే త్రాగాలి. మీకు కావాలంటే.. మీరు దానిని వడకట్టకుండానే త్రాగవచ్చు. తద్వారా శరీరం దానిలోని ఫైబర్‌ను కూడా పొందుతుంది.

ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి?

బాబా రామ్‌దేవ్ ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ ని తాగడం వల్ల చాలా త్వరగా ప్రయోజనం కనిపిస్తుందని చెప్పారు. కనీసం 7 నుంచి 10 రోజుల పాటు క్రమం తప్పకుండా త్రాగండి. అప్పుడు దాని ప్రభావం మీకే తెలుస్తుంది. ఎవరైనా హిమోగ్లోబిన్ లేదని ఆందోళన చెందుతుంటే.. రోజుకు రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) తీసుకోవచ్చు.

ఈ జ్యూస్ ప్రయోజనాలు

  1. శరీరంలోని హిమోగ్లోబిన్‌ వేగంగా పెరుగుతుంది. దానిమ్మ, బీట్‌రూట్, క్యారెట్ ఐరెన్ అద్భుతమైన వనరులు. ఇవి శరీరంలో రక్త హీనతను తగ్గించడంలో, హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఉసిరి, నిమ్మకాయలలో ఉండే విటమిన్ సి.. ఐరెన్ శోషణను వేగవంతం చేస్తుంది. తద్వారా శరీరానికి ఎక్కువ పోషణ లభిస్తుంది.
  2. శరీరంలో శక్తి , బలాన్ని పెంచుతుంది.. ఈ జ్యూస్ శరీరంలో ఎర్ర రక్త కణాలను (RBCs) పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఆక్సిజన్ సరఫరాని సరిచేస్తుంది. అలసట, బలహీనత, బద్ధకాన్ని తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని డీటాక్స్ చేసి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
  3. చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా చేస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్ల చర్మం పాలిపోయి నిర్జీవంగా మారుతుంది. ఈ జ్యూస్ లో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ సి, ఐరన్ చర్మ కాంతిని, తేమను కాపాడుతాయి. ఇది ముడతలు, పిగ్మెంటేషన్‌ను కూడా తగ్గిస్తుంది.
  4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: బీట్‌రూట్, అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆమ్లత్వం, మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు కాలేయాన్ని డీటాక్స్ చేస్తుంది. తద్వారా శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది.
  5. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది: ఉసిరి, అల్లం శరీరం వ్యాధి నిరోధకతను పెంచుతాయి. అంతే కాదు ఇది జలుబు, ఇన్ఫెక్షన్లు, అలెర్జీల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..