AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs IND: రంగంలోకి స్టార్ ఓపెనర్.. ఇంగ్లండ్ నుంచి పిలుపు.. 15 ఏళ్ల కల కోసం బీసీసీఐ పక్కా ప్లాన్..

జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో పటౌడీ సిరీస్‌లో భాగంగా భారత్ 5వ టెస్టు ఆడాల్సి ఉంది. ఆ టెస్టు మ్యాచ్‌కు ముందు భారత శిబిరంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో..

ENG vs IND: రంగంలోకి స్టార్ ఓపెనర్.. ఇంగ్లండ్ నుంచి పిలుపు.. 15 ఏళ్ల కల కోసం బీసీసీఐ పక్కా ప్లాన్..
Eng Vs Ind Mayank Agarwal
Venkata Chari
|

Updated on: Jun 27, 2022 | 2:24 PM

Share

ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు ఇంగ్లండ్ నుంచి పిలుపు వచ్చింది. భారత టెస్టు జట్టులో సభ్యుడిగా చేరనున్నాడు. జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో పటౌడీ సిరీస్‌లో భాగంగా భారత్ 5వ టెస్టు(ENG vs IND) ఆడాల్సి ఉంది. ఆ టెస్టు మ్యాచ్‌కు ముందు భారత శిబిరంలో ప్రకంపనలు సృష్టించిన మయాంక్ అగర్వాల్‌కు పిలుపు వచ్చింది. నిజానికి, ఇంగ్లండ్‌కు చేరుకున్న భారత టెస్ట్ జట్టులో కరోనా ప్రవేశించడం వల్ల ఆ జట్టు ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడంపై సందిగ్ధం నెలకొంది. కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఇప్పటికే జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, జట్టు ముందు ఓపెనింగ్ సమస్యను పరిష్కరించడానికి మయాంక్ అగర్వాల్‌ (Mayank Agarwal)ను పిలిచారు. కరోనా పాజిటివ్‌గా గుర్తించిన తర్వాత, రోహిత్ శర్మ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే అతను ఫిట్‌గా మారడం కోసం టీమ్ మేనేజ్‌మెంట్ వేచి చూస్తుంది. అందుకే కెప్టెన్సీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

రోహిత్‌పై తుది నిర్ణయం ఎప్పుడంటే?

ప్రస్తుతం, రోహిత్ శర్మకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోలేదు. భారత ప్రణాళిక ప్రకారం ఓపెనింగ్‌లో రోహిత్, శుభ్‌మన్ గిల్‌తో ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఒకవేళ రోహిత్ ఫిట్‌గా లేకుంటే మయాంక్ అగర్వాల్‌కు మాత్రమే అవకాశం దక్కుతుంది.

మయాంక్ అగర్వాల్ టెస్ట్ కెరీర్..

మయాంక్ అగర్వాల్ తన చివరి టెస్టును మార్చి 2022లో శ్రీలంకతో ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ వెళ్లే టెస్టు జట్టులో ఎంపిక కాలేదు. మయాంక్ అగర్వాల్ భారత్ తరఫున 21 టెస్టులు ఆడాడు. 41.33 సగటుతో 1488 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 4 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు సాధించాడు.

మయాంక్ అగర్వాల్ ఇప్పటి వరకు ఇంగ్లండ్‌తో ఏ టెస్టు ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బర్మింగ్‌హామ్ టెస్టులో అవకాశం లభిస్తే.. ఇంగ్లండ్‌తో అతనికి ఇదే తొలి టెస్టు మ్యాచ్ అవుతుంది. మయాంక్ అగర్వాల్ తన కెరీర్‌లో 21 టెస్టుల్లో 12 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 590 పరుగులు చేశాడు. అతని సగటు 26 కంటే తక్కువగా ఉంది. అతని బ్యాట్‌ నుంచి 77 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ హైలెట్‌గా నిలిచింది. అదేమిటంటే మయాంక్ అగర్వాల్ ఏ టెస్టు సెంచరీ చేసినా.. హోమ్ గ్రౌండ్ లోనే ఆ ఘనత సాధించాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన పటౌడీ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇటువంటి పరిస్థితిలో, బర్మింగ్‌హామ్‌ టెస్టును డ్రా చేసుకున్నా సరిపోతుంది. అయితే భారత్‌ ఓడిపోతే 15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ గెలవాలన్న కల గల్లంతవుతుంది. ఇందుకోసం భారత్ కట్టుదిట్టంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం రోహిత్ ప్లేస్‌లో మయాంక్‌ను రంగంలోకి దించారు.