AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పిస్తే బెటర్.. సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు.. ఎందుకంటే?

IND vs ENG: రోహిత్ పనిభారాన్ని తట్టుకోగలడు. అలాగే మానసిక అలసటను బాగా ఎదుర్కోగలడు. అయితే, ఆయన వయస్సును పరిగణనలోకి తీసుకుంటే..

Rohit Sharma: కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పిస్తే బెటర్.. సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు.. ఎందుకంటే?
Rohit Sharma
Venkata Chari
|

Updated on: Jun 27, 2022 | 4:46 PM

Share

టీమిండియా రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కోవిడ్ పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏకైక టెస్టులో ఆడతాడా లేదా అనేది సందిగ్ధంగా నిలిచింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ(Rohit Sharma) ఇకపై టీ20 సారథిగా విశ్రాంతి తీసుకోవచ్చని భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల తన పనిభారాన్ని మెరుగ్గా నిర్వహించగలడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. గాయాలు, పనిభారం కారణంగా కెప్టెన్ అయినప్పటి నుంచి రోహిత్ సక్రమంగా ఆడలేకపోతున్నాడు. ‘టీ20 కెప్టెన్‌గా భారత జట్టు మేనేజ్‌మెంట్‌లో వేరొకరి పేరు ఉంటే రోహిత్‌ను తప్పించవచ్చు’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ, ‘రోహిత్ పనిభారాన్ని తట్టుకోగలడు. అలాగే మానసిక అలసటను బాగా ఎదుర్కోగలడు. అయితే, ఆయన వయస్సును పరిగణనలోకి తీసుకుంటే మాత్రం, జాగ్రత పడాలని సెలక్టర్లకు’ సెహ్వాగ్ సూచించాడు.

టీ20 కెప్టెన్ మరొకరైతే రోహిత్‌కే లాభం..

రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీని తీసుకోకుంటే వన్డే, టెస్టు ఫార్మాట్లలో సరికొత్తగా చూస్తామని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ‘టీ20లో కొత్త కెప్టెన్‌తో రోహిత్ కాస్త విరామం తీసుకుని టెస్టులు, వన్డేలకు పుంజుకోగలడు’ అని సెహ్వాగ్ అన్నాడు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ మూడు ఫార్మాట్‌లలో ఒకే కెప్టెన్‌ను కోరుకుంటే రోహిత్ బెస్ట్ ఆప్షన్ అని సెహ్వాగ్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

సెహ్వాగ్ దృష్టిలో టాప్ 3లో కోహ్లీ లేడు..

ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు ముందు భారతదేశం అనేక కాంబినేషన్‌లను ప్రయత్నించింది. అయితే సెహ్వాగ్ మాట్లాడుతూ, బ్యాట్స్‌మెన్‌లలో మొదటి మూడు స్థానాల్లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ మాత్రమే ఉంటారని చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లి మూడో ర్యాంక్‌ నుంచి పడిపోయాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ, ‘భారత్‌లో టీ20లో చాలా మంది అటాకింగ్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. కానీ, నేను రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌లను మొదటి మూడు స్థానాల్లో చూడాలని కోరుకుంటాను. రోహిత్, ఇషాన్‌లకు పూర్తి హక్కు ఉంది. లెఫ్ట్‌ కాంబినేషన్‌లో ఇషాన్‌, రాహుల్‌లు కూడా టీ20 ప్రపంచకప్‌లో మంచి జోడీ కానున్నారు’ అని తెలిపాడు.

రోహిత్ శర్మ టీమ్ ఇండియా కెప్టెన్ అయినప్పటి నుంచి నిరంతరం బాధపడుతూనే ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌లో ఆడలేదు. అలాగే, అతను న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో కూడా అందుబాటులో లేడు. ఇప్పుడు అతను ఇంగ్లండ్‌తో చివరి టెస్టుకు ముందు కరోనా పాజిటివ్‌గా తేలాడు. రోహిత్ శర్మ వయస్సు కూడా 35 సంవత్సరాలు. అతని ఫిట్‌నెస్ మునుపటిలా లేదు. ఈ వెటరన్ ఆటగాడు మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియా భారాన్ని ఎలా నిర్వహిస్తాడో వేచి చూడాల్సిందే.