Watch Video: భర్త బౌలింగ్‌ను చీల్చి చెండాడిన భార్య.. సిక్సులు, ఫోర్లతో తుఫాన్ బ్యాటింగ్.. వైరల్ వీడియో..

పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కైనత్ ఇంతియాజ్ గతేడాది పెళ్లి చేసుకొని ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉంది. ఈ విరామంలో తన భర్త వకార్‌తో కలిసి సరదాగా గడుపుతోంది.

Watch Video: భర్త బౌలింగ్‌ను చీల్చి చెండాడిన భార్య.. సిక్సులు, ఫోర్లతో తుఫాన్ బ్యాటింగ్.. వైరల్ వీడియో..
Pakistan Women's Cricket Team Kainat Imtiaz
Follow us
Venkata Chari

|

Updated on: Jun 27, 2022 | 5:04 PM

ఆటలో బంధుత్వాలకు చోటు ఉండకూడదంటారు. తోడ బుట్టిన వారైనా సరే.. ప్రత్యర్థులుగా బరిలోకి దిగితే, ఒకరిపై ఒకరు సత్తా చూపాల్సిందే. లేదంటే ఆటలో ఓడిపోతారు. ఇక భార్యల విషయానికి వస్తే.. ఎలాంటి భర్త అయినా సరే, మారి ముందు మిగతా విషయాల్లో ఓడిపోవాల్సిందే. అయితే, ఓ మహిళా క్రికెటర్ మాత్రం ఏకంగా భర్త బౌలింగ్‌నే చీల్చి చెండాడి, బౌండరీల వర్షం కురిపించింది. దీంతో పాపం, భర్త చేసేందేంలేక అలా చూస్తుండిపోయాడు. భార్య దూకుడి ముందు భర్త తేలిపోయిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఇది అంతర్జాతీయ మ్యాచ్ మాత్రం కాదండోయ్.. సరదాగా ఆడిన మ్యాచ్‌లో సీన్.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆమె ఎవరు అని ఆలోచిస్తున్నారా.. పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కైనత్ ఇంతియాజ్(Kainat Imtiaz). గతేడాది వివాహం చేసుకుని ప్రస్తుతం జట్టు నుంచి విరామం తీసుకుని, భర్తతో సరదాగా హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ విరామంలో ఆమె తన భర్త వకార్‌తో పర్వతాల మధ్య అందమైన క్షణాలను గడుపుతోంది. కైనాత్ ఇంతియాజ్ ప్రస్తుతం పాకిస్తాన్ ఉత్తర ప్రావిన్స్‌లోని ఎత్తైన పర్వత శిఖరాలు, అందమైన లోయల మధ్య సేద తీరుతున్నారు.

అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో భార్య కైనత్ ఇంతియాజ్ తన భర్తపై బ్యాట్‌తో విరుచుకపడింది. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ రాణిస్తున్నట్లే.. ఆమె తన భర్తను ప్రత్యర్థి జట్టు బౌలర్‌గా భావించి, సిక్సులు, బౌండరీలతో చీల్చి చెండాడింది.

ఇవి కూడా చదవండి

గెలిచింది ఎవరంటే?

కైనాత్ ఇంతియాజ్ స్వయంగా తన భర్తతో కలిసి ఆడిన ఈ క్రికెట్ మ్యాచ్ వీడియోను తన స్వంత సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో ఆమె మొదట బ్యాటింగ్ చేసి తన భర్తపై ఆధిపత్యం చెలాయించింది. ఆ తరువాత ఆమె బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. తన భర్తను తొలి బంతికే పెవిలియన్ చేర్చింది. ఈ క్రమంలో అచ్చం అంతర్జాతీయ వికెట్ పడగొట్టినట్లు సంబరాలు చేసుకుంది.

భర్త బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడం సులభం – కైనత్

భర్త బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టిన తర్వాత కైనత్ మాట్లాడుతూ, “భర్త బౌలింగ్ చేస్తున్నప్పుడు సిక్సర్లు కొట్టడం చాలా సులభం అవుతుంది. ఈ మ్యాచ్ జరిగిన మైదానం సముద్ర మట్టానికి 2500 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది క్రికెట్ ఆడటానికి ఉత్తమమైన ప్రదేశం’ అని తెలిపింది. పాకిస్థాన్ ఆల్ రౌండర్ కైనత్ ఇంతియాజ్ గత ఏడాది వకార్‌ను వివాహం చేసుకుంది.

కైనత్ ఇంతియాజ్ ఆల్‌రౌండర్‌గా ఇప్పటివరకు పాకిస్థాన్ తరపున 15 వన్డేలు, 16 టీ20లు ఆడింది. వన్డేల్లో బ్యాట్‌తో 128 పరుగులు చేయడమే కాకుండా, బంతితో 9 వికెట్లు తీయగా, టీ20లో 124 పరుగులు చేసి 7 వికెట్లు తీసింది. కైనత్ ఇంతియాజ్ భారత ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామిని తన రోల్ మోడల్‌గా భావిస్తుంది.