ENG vs NZ: ప్రపంచ ఛాంపియన్‌ కివీస్‌కు భారీ షాక్.. టెస్ట్ సిరీస్‌ వైట్‌వాష్.. 145 ఏళ్ల క్రికెట్‌లో ఇంగ్లండ్ స్పెషల్ రికార్డ్..

గత రెండేళ్లలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ న్యూజిలాండ్‌కి ఇది అత్యంత ఘోర పరాజయం. ఇంగ్లండ్‌లో కివీ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఇటు గెలవలేక, అటు డ్రా చేసుకోలేకపోయింది.

ENG vs NZ: ప్రపంచ ఛాంపియన్‌ కివీస్‌కు భారీ షాక్.. టెస్ట్ సిరీస్‌ వైట్‌వాష్.. 145 ఏళ్ల క్రికెట్‌లో ఇంగ్లండ్ స్పెషల్ రికార్డ్..
Eng Vs Nz
Follow us

|

Updated on: Jun 27, 2022 | 8:25 PM

ఇంగ్లండ్ టెస్టు క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమైంది. కొత్త కెప్టెన్, కొత్త కోచ్ జోడీతో, ఇంగ్లండ్ క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్‌లో వన్డే, టీ20 పార్మాట్‌లో ఉత్సాహాన్ని నింపుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మొదటి బాధితుడిగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ న్యూజిలాండ్ (New Zealand Cricket Team) అయింది. బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మార్గదర్శకత్వంలో లీడ్స్ టెస్టులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 3-0తో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్‌ను ఓడించింది. అంతే కాదు.. ఈ సిరీస్‌ని ఇంగ్లండ్‌ గెలిచిన తీరుతో 145 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా ఓ అద్భుత రికార్డ్‌ కూడా క్రియేట్‌ చేసింది.

250 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్..

ఈ సిరీస్‌కు ముందు గత ఏడాది కాలంలో 17 టెస్టు మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్క మ్యాచ్‌లో నెగ్గిన ఇంగ్లండ్ జట్టు.. గత రెండు నెలల్లో పెను మార్పుల తర్వాత తన ఆటను, శైలిని పూర్తిగా మార్చేసింది. మెకల్లమ్, స్టోక్స్ దూకుడు శైలితో వచ్చిన ఈ మార్పు ఆధారంగా ఇంగ్లండ్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. లీడ్స్ టెస్టులో ఐదో, చివరి రోజున న్యూజిలాండ్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ సులువుగా సాధించింది. ఈ విధంగా, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 250 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా సాధించిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. అంతకుముందు లార్డ్స్ టెస్టులో 277, నాటింగ్‌హామ్‌లో 299 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించింది.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్‌కు శుభారంభం అందినా.. ఆపై..

తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఛేదించిన తీరు.. ఈసారి కూడా అదే తరహాలో కనిపించడంతో నాలుగో రోజునే పునాది పడింది. ఆలీ పోప్, జో రూట్ అర్ధ సెంచరీలు సాధించి జట్టును పటిష్ట స్థితిలో ఉంచారు. అయితే వర్షం కారణంగా ఐదో రోజు తొలి సెషన్ పూర్తిగా రద్దయింది. ఆ తర్వాత రెండో సెషన్‌లో జట్టు 183 పరుగుల లక్ష్యం కోసం ఆడడం ప్రారంభించింది. అయితే పోప్ (82) వెంటనే టిమ్ సౌథీకి బలి అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాటింగ్‌హామ్ టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో తుఫాను సెంచరీతో పాటు హెడ్డింగ్లీలో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన జో రూట్‌తో కలిసి క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్‌స్టో కామ్‌గా తన పని పూర్తి చేశాడు.

బెయిర్‌స్టో తుఫాను ఇన్నింగ్స్..

బెయిర్‌స్టో, రూట్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా బెయిర్‌స్టో తన దూకుడు శైలిని కొనసాగించాడు. ఇది చివరి మూడు ఇన్నింగ్స్‌లలో కనిపించింది. తన సొంత మైదానంలో ఆడుతూ, ఈ ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్ కేవలం 30 బంతుల్లోనే వేగంగా అర్ధ సెంచరీని పూర్తి చేసి న్యూజిలాండ్‌ను పూర్తిగా డకౌట్ చేశాడు. బెయిర్‌స్టో, రూట్‌లు కేవలం 87 బంతుల్లోనే 111 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి రెండో సెషన్‌లోనే మ్యాచ్‌ను ముగించారు. మైకేల్ బ్రేస్‌వెల్‌పై బెయిర్‌స్టో వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. బెయిర్‌స్టో 44 బంతుల్లో (8 ఫోర్లు, 3 సిక్సర్లు) 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రూట్ 86 పరుగులు (125 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు.

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!