Watch Video: తండ్రి ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ అందించిన రోహిత్ కుమార్తె.. నెట్టింట్లో వైరలవుతోన్న క్యూట్ వీడియో..
Ind vs Eng 5th Test, Rohit Sharma: రోహిత్ ఏం చేస్తున్నాడంటూ సమైరాను యూకే విలేకరులు అడిగిన ప్రశ్నకు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతో ముద్దుగా సమాధానం ఇచ్చింది.
Ind vs Eng 5th Test: ఎడ్జ్‌బాస్టన్‌లో మరో వారం రోజుల్లోనే భారత్, ఇంగ్లండ్‌తో ఐదో, చివరి టెస్టు ఆడనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్ట్‌కు ముందు, టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) కోవిడ్‌కు పాజిటివ్‌గా తేలాడు. దీంతో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే, అంతకు ముందు జరిగిన 4 టెస్టుల్లో రోహిత్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, ఈ టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ప్రస్తుతానికి సందిగ్ధంగా మారింది. ఈ క్రమంలో రోహిత్ కుమార్తె ఓ కీలక అప్‌డేట్ అందించింది. రోహిత్ ఏం చేస్తున్నాడంటూ సమైరాను యూకేలో విలేకరులు ప్రశ్నించారు. కాగా, సమైరా చెప్పిన సమాధానం ప్రస్తుం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.
విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తన తండ్రి గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడంటూ ఎంతో క్యూట్‌గా సమైరా వెల్లడించింది. సమైరా రోహిత్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను అందించిన ఈ వీడియో అభిమానులకు ఎంతగానో నచ్చింది. దీంతో సమైరా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు కామెంట్లతో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ఇటీవల లీసెస్టర్‌షైర్‌తో ముగిసిన మ్యాచ్‌లో రోహిత్ జట్టులో భాగమయ్యాడు. ఆట చివరి రోజున కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయినందున అతను ఆడలేదు. అప్పటి నుంచి ఐసోలేషన్‌లో ఉన్నాడు. డాక్టర్ల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. సెలెక్టర్ చేతన్ శర్మ యూకే చేరుకోనున్నందున, రాబోయే టెస్ట్‌లో టీమిండియాకు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై నేడు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
#RohitSharma Daughter #samaira Today at #Leicester How cute she is ?? MY FATHER IS TAKING REST IN THE ROOM GOT #covidpositive @ritssajdeh @ImRo45 #ENGvIND @ITGDsports pic.twitter.com/Tbpu0HSUIQ
— Krishna sai ✊?? (@Krishna19348905) June 27, 2022
కెప్టెన్‌గానే కాదు, ఆర్డర్‌లో టాప్‌లో కూడా రోహిత్ కీలక బ్యాటర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఒకవేళ రోహిత్ టెస్టు ఆడకపోతే భారీ ఎదురుదెబ్బ తప్పదు. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడని నివేదికలు సూచిస్తున్నాయి. ఏం జరుగుతుందో నేడు తెలియనుంది.