Rohit Sharma: రోహిత్ ‘అన్‌ఫిట్’ శర్మ.. కీలక సమయంలో హ్యాండిస్తోన్న అదృష్టం.. కెరీర్‌లో ఇలాంటి సంఘటనలెన్నో..

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రోహిత్ శర్మ ఆడటంపై సందిగ్ధం నెలకొంది. కరోనా పాజిటివ్‌గా తేలడంతో, ప్రస్తుతం రోహిత్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. జులై 1 నుంచి ప్రారంభమయ్యే టెస్టులో ఆడతాడా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు.

Rohit Sharma: రోహిత్ 'అన్‌ఫిట్' శర్మ.. కీలక సమయంలో హ్యాండిస్తోన్న అదృష్టం.. కెరీర్‌లో ఇలాంటి సంఘటనలెన్నో..
Rohit Sharma Fitness
Follow us
Venkata Chari

|

Updated on: Jun 28, 2022 | 4:19 PM

జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌ వర్సెస్ ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ టెస్టు ఇరుజట్లకు చాలా కీలకమైనది. ఎందుకంటే గతేడాది సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, ఆ సమయంలో కరోనా కారణంగా గత ఏడాది ఈ మ్యాచ్ జరగలేదు. ప్రస్తుతం చివరి టెస్ట్‌ను జులై 1న నిర్వహించనున్నారు. సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమ్ ఇండియా చూస్తోంది. కానీ అంతకు ముందు, కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలడంతో, భారీ దెబ్బ తగిలింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు. రోహిత్‌ ఆడకపోతే టీమిండియా కెప్టెన్‌ ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం క్రికెట్ అభిమానులను వేధిస్తోంది. ఇలాంటి అనేక ప్రశ్నలను పక్కనపెట్టి, రోహిత్ గురించి మాట్లాడితే.. చాలా కీలక సందర్భాలలో రోహిత్‌కు దురదృష్టం వెంటాడుతుందని మాజీలు అంటున్నారు. ఇలా అదృష్టం ద్రోహం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయంటూ నెట్టింట్లో చర్చించుకుంటున్నారు.

కొన్నిసార్లు రోహిత్ శర్మ అన్ ఫిట్ అవుతుండగా, కొన్నిసార్లు బ్యాడ్ ఫామ్ అతని లయను చెడగొడుతోంది. టీమ్ ఇండియాకు మ్యాచ్ లేదా సిరీస్ చాలా కీలకమైనప్పుడు ఇది ఎక్కువగా జరుగుతుంది.

రోహిత్ అదృష్టం కలిసి రాని సందర్భాలు..

ఇవి కూడా చదవండి
  1. 2011 ప్రపంచకప్ సమయంలో రోహిత్ శర్మకు జట్టులో చోటు దక్కలేదు. ప్రపంచ కప్‌కు కొంత సమయం ముందు రోహిత్ శర్మ పరుగులు భారీగానే చేస్తున్నాడు. కానీ ప్రపంచ కప్ దగ్గరికి వచ్చేసరికి, అతని ఫామ్ క్షీణించింది, ఆ సమయంలోనే గాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో సెలక్టర్లు అతనికి జట్టులో చోటు ఇవ్వలేదు.
  2. ఇటీవలి కొన్ని సందర్భాలను పరిశీలిస్తే, 2020-21లో ఆస్ట్రేలియా సిరీస్ ఆడేందుకు టీమిండియా వెళ్లాల్సిన సమయంలో రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఇటువంటి పరిస్థితిలో అతను మొదటి రెండు మ్యాచ్‌లలో పాల్గొనలేకపోయాడు. మొదటి మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, చివరి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ ఆడాడు.
  3. రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చిన సందర్భంలోనూ తొలిసారి విదేశీ పర్యటన అంటే దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. కానీ, గాయంతో రోహిత్ శర్మ టెస్ట్ జట్టులో భాగం కాలేదు. వన్డే సిరీస్ కూడా ఆడలేకపోయాడు. అతని గైర్హాజరీలో కేఎల్ రాహుల్ వన్డే టీమ్‌కు బాధ్యత వహించాడు. భారత్ సిరీస్‌ను కోల్పోయింది.