IND Vs IRE 2nd T20: జమ్మూ ఎక్స్‌ప్రెస్‌కు మరో ఛాన్స్.. రితురాజ్ గైక్వాడ్‌ డౌట్.. రెండో టీ20లో భారత్ ప్లేయింగ్‌ XI ఎలా ఉండనుందంటే?

మెలాహిడ్‌లో ఇప్పటివరకు 15 టీ20 ఇంటర్నేషనల్‌లు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 9మ్యాచ్‌ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనూ ఛేజింగ్‌లోనే టీమిండియా విజయం సాధించింది. ఇటువంటి పరిస్థితిలో..

IND Vs IRE 2nd T20: జమ్మూ ఎక్స్‌ప్రెస్‌కు మరో ఛాన్స్.. రితురాజ్ గైక్వాడ్‌ డౌట్.. రెండో టీ20లో భారత్ ప్లేయింగ్‌ XI ఎలా ఉండనుందంటే?
India Vs Ireland 2nd T20
Follow us

|

Updated on: Jun 28, 2022 | 5:21 PM

భారత్, ఐర్లాండ్ మధ్య రెండు అంతర్జాతీయ టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో, చివరి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు 1-0తో ముందంజలో నిలిచింది. టీమిండియా రెండో మ్యాచ్‌లో గెలిస్తే 2022లో జరిగిన టీ20ల్లో మూడో సిరీస్‌ని కైవసం చేసుకుంటుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు శ్రీలంక, వెస్టిండీస్‌పై భారత్‌ సిరీస్‌లను గెలుచుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ 2-2తో సమంగా ముగిసింది. తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు 12 ఓవర్లలో 108 పరుగులు ఇచ్చారు. ఇదిలావుండగా, బౌలింగ్ లైనప్‌లో మార్పులపై పెద్దగా ఆశలు లేవు. జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌కు మరో అవకాశం లభించవచ్చు. తొలి మ్యాచ్‌లో ఉమ్రాన్ కేవలం 1 ఓవర్ వేసి 14 పరుగులు ఇచ్చాడు. వీరితో పాటు భువనేశ్వర్ కుమార్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అవేశ్ ఖాన్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ స్పిన్నర్ విభాగంలో ఉన్నారు.

గైక్వాడ్ ఫిట్‌గా లేకుంటే, శాంసన్‌కు అవకాశం..

ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ కాలి కండరాలలో ఒత్తిడి కారణంగా మొదటి టీ20లో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఒకవేళ అతను పూర్తి ఫిట్‌నెస్‌తో లేకుంటే, అతని స్థానంలో సంజూ శాంసన్ ప్లేయింగ్-11లో అవకాశం పొందవచ్చు. ఈ స్థితిలో మరోసారి ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా ఇన్నింగ్స్‌ ఓపెనింగ్‌ చేయగలరు. మిడిల్ ఆర్డర్‌లో శాంసన్‌ను ప్రయత్నించవచ్చు. గైక్వాడ్ ఫిట్‌గా ఉంటే తొలి వన్డేలో ప్లేయింగ్-11ని మార్చకుండా ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

వర్షం పడే అవకాశం..

వర్షం కారణంగా, మొదటి T20 మ్యాచ్‌లో ఇరుజట్లు చెరో 12 ఓవర్లు మాత్రమే కేటాయించారు. రెండో మ్యాచ్‌లోనూ వర్షం పడే అవకాశం ఉంది. మెలాహిడ్‌లో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పిచ్ రిపోర్ట్:

మెలాహిడ్‌లో ఇప్పటివరకు 15 టీ20 ఇంటర్నేషనల్‌లు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 9మ్యాచ్‌ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనూ ఛేజింగ్‌లోనే టీమిండియా విజయం సాధించింది. ఇటువంటి పరిస్థితిలో, టాస్ గెలిచిన తర్వాత, కెప్టెన్ మొదట ఫీల్డింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది.

ఇరు జట్లు ఇలా ఉండే ఛాన్స్..

భారత్‌లో ప్లేయింగ్ XI: ఇషాన్ కిషన్, రితురాజ్ గైక్వాడ్/సంజు శాంసన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ మరియు యుజ్వేంద్ర చాహల్.

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, ఆండీ మెక్‌బ్రియన్, జార్జ్ డాక్రెల్, మార్క్ ఈడర్, క్రెయిగ్ యంగ్, కోనర్ ఓల్ఫెట్, జాషువా లిటిల్.