AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 ఏళ్లకే ఇంటి నుంచి వెళ్లిపోయి.. కట్ చేస్తే.. రంజీల్లో దుమ్మురేపిన ముంబై ఇండియన్స్ ప్లేయర్.. ఎవరంటే?

రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్ ముంబైని ఓడించింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ కుమార్ కార్తికేయ మధ్యప్రదేశ్‌ను ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు.

15 ఏళ్లకే ఇంటి నుంచి వెళ్లిపోయి.. కట్ చేస్తే.. రంజీల్లో దుమ్మురేపిన ముంబై ఇండియన్స్ ప్లేయర్.. ఎవరంటే?
Kumar Karthikeya Ranji
Venkata Chari
|

Updated on: Jun 28, 2022 | 5:39 PM

Share

రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఫైనల్లో మధ్యప్రదేశ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ముంబై(Mumbai)ని ఓడించి తొలిసారి ఈ టైటిల్‌ను గెలుచుకుంది. మధ్యప్రదేశ్ చారిత్రాత్మక విజయంలో చాలా మంది కీలక పాత్ర పోషించారు. ఇందులో కోచ్ చంద్రకాంత్ పండిట్‌కు అత్యధిక క్రెడిట్ దక్కుతోంది. అలాగే మధ్యప్రదేశ్ విజయంలో మరో కీలక పాత్ర పోషించిన ఆటగాడు ఒకరు ఉన్నారు. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున 32 వికెట్లు తీసిన ఎడమచేతి వాటం స్పిన్నర్ కుమార్ కార్తికేయ గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ షామ్స్ ములానీ తర్వాత ఎక్కువ మంది బాధితులను పెవిలియన్ చేర్చాడు. కార్తికేయ మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు కుమార్ కార్తికేయ (Kumar Kartikeya) ప్రతిభకు ప్రపంచం సెల్యూట్ చేస్తోంది. ఎన్నో బాధలు చవిచూసిన ఈ ఆటగాడు విజయం కోసం చాలా కష్టపడ్డాడు. కార్తికేయ సింగ్ కథ వింటే ఎంతో ప్రేరణగా నిలస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కుమార్ కార్తికేయ 9 ఏళ్లుగా ఇంటికి వెళ్లలేదు..

ఇవి కూడా చదవండి

మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ యూపీలోని సుల్తాన్‌పూర్‌కు చెందినవాడు. కార్తికేయ తండ్రి యుపీ పోలీస్‌ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నాడు. అయితే, ఈ ఆటగాడు గత 9 సంవత్సరాలుగా అతని కుటుంబ సభ్యులను కలవలేదు. కార్తికేయ కేవలం 15 ఏళ్లకే ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కార్తికేయ తన తల్లి, తండ్రితో ఏదైనా సాధించాకే ఇంటికి వస్తానని చెప్పి, బయటకు వచ్చినట్లు పేర్కొన్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో సంభాషణలో కుమార్ కార్తికేయ మాట్లాడుతూ , ‘9 సంవత్సరాల, 2 నెలల, మూడు రోజులు, నేను నా తల్లిదండ్రులను కలవలేదు. ఇప్పుడు నాకు 20-25 రోజులు విరామం లభిస్తుంది. అందుకే ఇంటికి వెళ్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

కార్తికేయ ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయాడు?

U-16 జట్టులో ఎంపిక కానందున కార్తికేయ సింగ్ ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టాడు. కార్తికేయ సింగ్ తండ్రి శ్యామ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ‘నేను తండ్రిని, నేను నా భావాలను ఆపగలను, కానీ, అతని తల్లి చాలా భావోద్వేగానికి గురవుతుంది. కార్తికేయ కోసం ఎదురుచూస్తున్నాం. U-16 జట్టులో ఎంపిక కాకపోవడంతో కార్తికేయ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. క్రికెట్‌లో పేరు తెచ్చుకున్నప్పుడే ఇంటికి తిరిగి వస్తానని హామీ ఇచ్చాడు’ అంటూ పేర్కొన్నాడు.

కార్తికేయ టైర్ల ఫ్యాక్టరీలో పనిచేసేవాడు..

కార్తికేయ సింగ్ యూపీ నుంచి ఢిల్లీకి వెళ్లి జీవనోపాధి కోసం టైర్ల ఫ్యాక్టరీలో పని చేయడం ప్రారంభించాడు. కార్తికేయ రాత్రిపూట షిఫ్టులు చేసేవాడు. 10 రూపాయలు ఆదా చేయడానికి మైళ్ళ దూరం నడిచేవాడు. ఒక సంవత్సరం పాటు కార్తికేయ ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేదు. ఢిల్లీలో, కార్తికేయ స్నేహితుడు రాధే అతన్ని గౌతమ్ గంభీర్ కోచ్ సంజయ్ భరద్వాజ్ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ అతను నెట్స్‌లో మొదటి బంతిని వేసిన వెంటనే ఆటగాడి సామర్థ్యాన్ని గ్రహించాడు.

సంజయ్ భరద్వాజ్ క్రికెట్ అకాడమీ ఢిల్లీలోని అశోక్ విహార్‌లో ఉంది. కార్తికేయ సింగ్ ఘజియాబాద్‌లో నివసించేవాడు. కార్తికేయ సింగ్ రోజ్ అకాడమీలో శిక్షణ కోసం 32 కి.మీ. ప్రయాణించేవాడు. ఢిల్లీ క్రికెట్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన ఉన్నప్పటికీ, అతను రంజీ జట్టులో స్థానం పొందలేదు. ఆ తర్వాత సంజయ్ భరద్వాజ్ ఈ ఆటగాడిని 2017 సంవత్సరంలో షాడోల్ క్రికెట్ అసోసియేషన్‌కు పరిచయం చేశాడు. కార్తికేయ 2018లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఈ ఆటగాడు తన సత్తాను చాటుతూ క్రమంగా పేరుతెచ్చుకుంటున్నాడు.