AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wimbledon 2022: మొదలైన వింబుల్డన్ సమరం.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ.. తొలిరౌండ్‌లో ఓడినా నోట్ల వర్షమే..

టెన్నిస్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ (Wimbledon 2022) ఈ సంవత్సరం ప్రైజ్ మనీలో గణనీయమైన మార్పులను చేసింది. దీంతో విజేతలతోపాటు పరాజితులకు కూడా భారీగా ప్రైజ్‌మనీ దక్కనుంది.

Wimbledon 2022: మొదలైన వింబుల్డన్ సమరం.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ.. తొలిరౌండ్‌లో ఓడినా నోట్ల వర్షమే..
Wimbledon 2022 Prize Money
Venkata Chari
|

Updated on: Jun 27, 2022 | 6:56 PM

Share

టెన్నిస్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టోర్నమెంట్ ప్రారంభమైంది. వింబుల్డన్ 2022(Wimbledon 2022) అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాస్ కోర్ట్ గ్రాండ్ స్లామ్ ఆల్ ఇంగ్లాండ్ క్లబ్‌లో ప్రారంభమైంది. ప్రపంచంలోని అనేక మంది గొప్ప ఆటగాళ్లు ఈ అద్భుతమైన టైటిల్‌ను గెలుచుకోవడానికి పోటీ పడుతున్నారు. ఈసారి టోర్నమెంట్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఈసారి రష్యా, బెలారస్ ఆటగాళ్లను నిషేధించారు. అయితే గొప్ప క్రీడాకారిణులలో ఒకరైన సెరెనా విలియమ్స్(Serena Williams) మాత్రం తిరిగి కోర్టులో కనిపించనుంది. వీటన్నింటితో పాటు, ఈసారి విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ (Wimbledon 2022 Prize Money) కూడా గణనీయంగా పెరిగింది.

ప్రపంచంలోని అత్యంత పురాతన గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌షిప్ వింబుల్డన్‌కు సంబంధించి ప్రతి సంవత్సరం టెన్నిస్ క్రీడాకారులు, అభిమానుల ఉత్సాహం పూర్తిగా భిన్నమైన స్థాయిలో ఉంటుంది. టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలో మూడవ స్థానంలో ఆడిన వింబుల్డన్.. టెన్నిస్ అసలు ఫార్మాట్‌లో గ్రాస్ కోర్ట్‌లో ఆడనున్నారు. టెన్నిస్ సంప్రదాయంలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉండడానికి కారణం ఇదే. చారిత్రక ప్రాధాన్యతతో పాటు విజేతలకు లభించే ప్రైజ్ మనీ కూడా ఈ ఛాంపియన్‌షిప్‌కు ఎంతో ప్రత్యేకతను కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఛాంపియన్ ఆటగాళ్ల జేబులో ఎంత డబ్బు వస్తుందో ఇప్పుడు చూద్దాం..

విజేతలు దాదాపు రూ. 20 కోట్లు సంపాదిస్తారు..

ఇవి కూడా చదవండి

జూన్ 27 సోమవారం ప్రారంభమైన వింబుల్డన్, జులై 10న పురుషుల సింగిల్స్ ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ సమయంలో, ప్రతి రౌండ్‌కు చేరుకునే ఆటగాళ్లకు ప్రైజ్ మనీ కూడా లభిస్తుంది. అయితే విజేతలకు మాత్రమే భారీ చెక్ లభిస్తుంది. బ్రిటీష్ వార్తాపత్రిక ది సన్ ప్రకారం, 2007 నుంచి కొనసాగుతున్న సంప్రదాయం మేరకు, ఈసారి మహిళలు, పురుషుల విజేతలు కూడా సమాన మొత్తాన్ని పొందుతారు.

మహిళల, పురుషుల సింగిల్స్ విజేతలకు 2 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు (దాదాపు రూ. 19.23 కోట్లు) అందుతాయి. రెండు ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన వారికి 1.05 మిలియన్ పౌండ్లు అంటే దాదాపు రూ. 10.09 కోట్లు లభిస్తాయి. ఈసారి విజేతల ప్రైజ్ మనీని 3 లక్షల పౌండ్లు (రూ. 2.88 కోట్లు) పెంచారు.

ఓడిన వారికి కూడా..

అదే సమయంలో సెమీఫైనల్‌కు చేరుకునే ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరినందుకు 5 లక్షల 35 వేల పౌండ్లు (రూ. 5.14 కోట్లు), 3.10 లక్షల పౌండ్లు (రూ. 2.98 కోట్లు) అందుకుంటారు. అదే సమయంలో నాలుగో రౌండ్‌లో 1.90 లక్షల పౌండ్లు (రూ. 1.82 కోట్లు), మూడో రౌండ్‌లో 1.20 లక్షల పౌండ్‌లు (రూ. 1.15 కోట్లు), రెండో రౌండ్‌లో 78 వేల పౌండ్లు (75 లక్షల రూపాయలు) అందుకుంటారు. ఇది మాత్రమే కాదు, ఇప్పటికే మొదటి రౌండ్‌లో అవుట్ అయిన ఆటగాళ్లు కూడా భారీగా సంపాదించనున్నారు. వారి ఖాతాలో 50 వేల పౌండ్లకు పైగా అంటే రూ. 48 లక్షలు చేరనున్నాయి.

డబుల్స్ విషయానికొస్తే, ఇక్కడ కూడా విజేతలకు మంచి మొత్తం లభిస్తుంది. పురుషులు, మహిళలు, మిక్స్‌డ్ డబుల్స్‌లో గెలుపొందిన జంటలు 5.40 లక్షల పౌండ్ల(రూ. 5.19కోట్లు) బహుమతిని అందుకుంటారు.