AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గురి చూసిందంటే తప్పేదేలే.. మహిళ టాలెంట్‌కు నెటిజన్స్ ఫిదా.. ఎందుకో తెలుసా?

ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో ఒక మహిళ చేసిన పనికి నెటిజన్లంతా షాకవుతున్నారు. అలాగే బాస్కెట్‌బాల్ టీంలో చేరాలని సూచిస్తున్నారు.

Viral Video: గురి చూసిందంటే తప్పేదేలే.. మహిళ టాలెంట్‌కు నెటిజన్స్ ఫిదా.. ఎందుకో తెలుసా?
Women Making Cow Dung Cake Viral Video
Venkata Chari
|

Updated on: Jun 30, 2022 | 4:53 PM

Share

భారతీయులలో ప్రతిభకు కొదవలేదు. విలేజ్ నుంచి సిటీ వరకు ఎందరినో మనం చూస్తూనే ఉన్నాం. ఈ మేరకు కొన్ని వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తూనే ఉంటాయి. అప్పటివరకు సాదాసీదాగా కనిపించిన వారు, ఒక్కసారిగా ఈ వీడియాలతో నెట్టింట్లో ఫేమస్ అయిపోతారు. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. దీనిలో ఒక మహిళ గోడపై పిడకలను అతికించడాన్ని చూడొచ్చు. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా.. అయితే పదండి, అసలు విషయం ఏంటో తెలుసుకుందాం మరి..

వైరల్ వీడియోలో, మహిళ తన చేతితో ఆవు పేడను తీసుకుని, గోడపై చాలా ఎత్తులోకి విసరడాన్ని గమనించవచ్చు. అయితే, అంత ఎత్తులో కచ్చితమైన ప్లేస్‌లో పేడను విసరడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వీడియోని చూసిన వినియోగదారులంతా షాకవుతున్నారు. దీంతో టీమిండియా బాస్కెట్‌బాల్ టీంలోకి ఈ మహిళను తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తర ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ 24 సెకన్ల వీడియోలో మహిళ తన అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకుంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 649k వ్యూస్ వచ్చాయి. అలాగే 24k యూజర్లు వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోకు “ఈమె కోసం భారత బాస్కెట్‌బాల్ జట్టు వెతుకుతోంది” అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లందరూ కూడా ఈ మహిళను బాస్కెట్‌బాల్ ఆడమని సూచిస్తుండడం విశేషం.