Photo puzzle: మీ కంటి చూపు ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకోండి.. ఈ ఫోటోలో టెన్నిస్ రాకెట్ కనిపెట్టండి

ఫోటో పజిల్స్‌ను ఈ మధ్య చాలామంది ఇష్టపడుతున్నారు. ఫోటో పజిల్స్ మన మెదడును చురుగ్గా చేయడమే కాదు.. మన ఐ పవర్ ఏ స్థాయిలో ఉందో కూడా చెప్పేస్తాయి. తాజాగా మీ కోసం ఓ క్రేజీ ఫజిల్...

Photo puzzle: మీ కంటి చూపు ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకోండి.. ఈ ఫోటోలో టెన్నిస్ రాకెట్ కనిపెట్టండి
Photo Puzzle
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 30, 2022 | 5:21 PM

Challenging Quiz: వచ్చేశాం అండీ వచ్చేశాం…. పజిల్ లవర్స్ కోసం ఓ క్రేజీ పజిల్‌ తీసుకువచ్చాం. పక్కాగా చెబుతున్నాం. ఈ పజిల్ మిమ్మల్ని మస్త్ కన్‌ఫ్యూజ్ చేస్తుంది. మీ ఐ పవర్ ఏ మాత్రం ఉందో చెప్పేస్తుంది. రోజూ ఎన్ని ఫోటోలు కెమెరాల్లో స్టోర్ అవుతున్నాయో చెప్పడమే కష్టం. మొబైల్స్‌లో కెమెరాలు వచ్చాక.. చాలామంది ప్రతి మూమెంట్‌ను ఓ మంచి మెమరీగా మార్చుకుంటున్నారు. స్నాప్ చాట్ వంటి యాప్స్ వచ్చాక.. విపరీతంగా ఫోటోలు క్లిక్ చేస్తున్నారు.  అయితే కొన్ని ఫోటోలు చాలా స్పెషల్‌లా అనిపిస్తాయి. ఆ ఫోటోలలో జీవిత పాఠాలు దాగి ఉంటాయి. ఇంకొన్ని క్రియేట్ చేసిన ఫోటోలు… మేం చాలా తెలివైనవాళ్లం.. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశిలిస్తాం అనుకునే వాళ్లను కూడా వెర్రివాళ్లను చేస్తాయి. ఆ కేటగిరీకి చెందినవే ఆప్టికల్ ఇల్యూషన్(Optical illusion) ఫోటోస్. లేటెస్ట్‌గా అలాంటి ఫోటోనే మీ ముందుకు తెచ్చాం. ఈ ఫోటోలో ఓ టెన్నిస్ రాకెట్ ఉంది. అక్కడున్న వస్తువుల మధ్యలో  కనిపెట్టడం అంత సులువు కాదు సుమీ.  మీ ఐ పవర్ సూపర్‌గా ఉంటే తక్కువ సమయంలోనే ఆ  టెన్నిస్ రాకెట్‌ను కనిపెట్టవచ్చు. ఇంకెందుకు ఆలస్యం బాగా ఫోకస్ పెట్టి చూస్తే .. దాన్ని తక్కువ సమయంలోనే పట్టేయవచ్చు. ఒకవేళ మీరు పజిల్ సాల్వ్ చేయలేకపోతే.. ఆన్సర్ ఉన్న ఫోటో చూశాక.. అరెరె అక్కడే ఉన్నా కనిపెట్టలేకపోయాం అనిపిస్తుంది.  ఏదో పైపైన చూస్తే మాత్రం అది దొరకదు. ఎంత చూసినా మాకు కనిపించడం లేదు.. కష్టం బాబోయ్ అనిపిస్తే దిగువన ఫోటో చూడండి.

Puzzle

Puzzle

మరిన్ని ట్రెండింగ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..