Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Cream: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ ఇదే.. దీని ధర అక్షరాల రూ. 19 లక్షల 53 వేల.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..

ఒకప్పుడు సీజనల్‌గా కనిపించే ఈ ఐస్‌క్రీమ్‌‌లు ఇప్పుడు ఎవర్‌ గ్రీన్ గా మారిపోయాయి. అన్ని కాలాల్లో లభిస్తున్నాయి. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా డైరీ సంస్థలు నోరూరించేలా..

Ice Cream: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ ఇదే.. దీని ధర అక్షరాల రూ. 19 లక్షల 53 వేల.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..
World Most Expensive Ice Cr
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 30, 2022 | 5:21 PM

ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టపడని వారుంటారో చెప్పండి. అన్ని వయసుల వారిని నోరూరించేది ఈ హిమక్రిములు. ఒకప్పుడు సీజనల్‌గా కనిపించే ఈ ఐస్‌క్రీమ్‌‌లు ఇప్పుడు ఎవర్‌ గ్రీన్ గా మారిపోయాయి. అన్ని కాలాల్లో లభిస్తున్నాయి. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా డైరీ సంస్థలు నోరూరించే విభిన్న రకాల ఐస్‌క్రీమ్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అయితే మనకు తెలిసి క్రీమ్ స్టోన్ వంటి స్టోర్లలో వీటి ధర చాలా ఎక్కువగానే ఉంటుంది. ఫేమస్ ఐస్‌క్రీమ్‌ స్టోర్లలో వీటి ధర రూ.500, రూ.1000 పైగా ఉంటుంది. అయితే, ఒక స్కూప్ ఐస్‌క్రీమ్‌ ధర బంగారంతో సమానంగా ఉంటుందంటే నమ్మక తప్పదు. ఇంతలా ఉంటుందని ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఊహించారా..? మీరు చదువుతున్నది నిజమే. న్యూయార్క్‌లోని సెరెండిపిటీ 3 రెస్టారెంట్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ను అందిస్తున్నారు.

దీని ఖరీదు సామాన్యులకు అందనిది.. ఈ రెస్టారెంట్‌లో లభించే ఫ్రోజెన్ హాట్ చాక్లెట్ 25 వేల డాలర్లకు అమ్ముడవుతోంది. ఇది ఇండియన్ కరెన్సీల్లో అక్షరాల రూ. 19 లక్షల 53 వేల కంటే ఎక్కువ. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, అటువంటి ఖరీదైన ఐస్ క్రీం 28 కోకోల మిశ్రమం నుంచి తయారు చేయబడింది. ఇందులో ప్రపంచంలోని 14 అత్యంత ఖరీదైన కోకో ఉన్నాయి. అదే సమయంలో, ఐస్ క్రీం పైన ఐదు గ్రాముల తినదగిన 23 క్యారెట్ బంగారం పొరతో డెకొరెట్ చేస్తారు.

తినదగిన బంగారంతో పాటు, దానిపై ఒక క్యారెట్ డైమండ్ పొర కూడా ఉపయోగించారు. అంతేకాదు ఇందులో మరో ప్రత్యేకత కూడా ఉంది. వజ్రాలు పొదిగిన బంగారం స్పూన్ కూడా ఈ ఐస్‌క్రీమ్ తినడానికి అందింస్తారు. అయితే ఈ గోల్డెన్ ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత ఈ డైమాండ్, గోల్డ్ స్పూన్ ఆ రెస్టారెంట్‌లోనే వదిలివేయకుండా ఇంటికి తీసుకెళ్లవచ్చు. న్యూయార్క్‌లోని సెరెండిపిటీ 3 రెస్టారెంట్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అందిస్తున్నాయి. దీని ధర 15,000 రూపాయలు, ఇది ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చిన సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడుతుంది.

ట్రెండింగ్ వార్తల కోసం