WhatsApp Update: వీడియో కాల్‌లో కీలక మార్పు.. సరికొత్త అప్‌డేట్‌తో సిద్ధమైన వాట్సాప్.. అదేంటంటే?

త్వరలో WhatsApp వీడియో కాల్‌లో కొత్త ఎంపికను పొందనున్నారు. ఈ ఎంపిక సహాయంతో కాల్‌లో యూజర్ తనకు బదులుగా వారి అవతార్ కనిపించనుంది. ఈ యాప్ రాబోయే ఫీచర్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది.

WhatsApp Update: వీడియో కాల్‌లో కీలక మార్పు.. సరికొత్త అప్‌డేట్‌తో సిద్ధమైన వాట్సాప్.. అదేంటంటే?
Follow us
Venkata Chari

|

Updated on: Jun 30, 2022 | 9:40 PM

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు అప్‌డేట్‌లను అందిస్తుంది. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి యాప్ కొత్త ఫీచర్‌లను జోడిస్తుంది. గత కొన్ని నెలలుగా WhatsApp అనేక కొత్త ఫీచర్లను జోడించింది. యాప్‌లో త్వరలో కొత్త ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్ ఎమోజీ ప్రేరణతో రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి.

WABetaInfo నివేదిక ప్రకారం వాట్సప్ కొత్త ఫీచర్‌పై పని చేస్తోందని తెలుస్తోంది. ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు WhatsApp వీడియో కాల్‌లో వారి యానిమేటెడ్ అవతార్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ యానిమేటెడ్ అవతార్స్ వాట్సప్ ప్రొఫైల్ ఫోటోలను కూడా భర్తీ చేయగలవని అంటున్నారు. ప్రస్తుతం యాప్ ఈ ఫీచర్‌పై పని చేస్తోంది. ఇది బీటా దశలో అందుబాటులో ఉంది.

వాట్సాప్ వీడియో కాల్‌లో కొత్త ఫీచర్..

ఇవి కూడా చదవండి

నివేదిక ప్రకారం యూజర్స్.. ‘అవతార్‌కు మారండి’ అనే కొత్త బటన్‌ను పొందనున్నారు. ఈ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులు లైవ్ ఫ్రంట్ కెమెరా ఫీడ్ నుంచి తమ అవతార్‌కి మారవచ్చు. కొంతమంది బీటా వినియోగదారులు వీడియో కాల్‌ల సమయంలో ఈ ఎంపికను పొందుతున్నారు.

2డీ లేదా 3డీలో పొందుతారా లేదా అనేది ప్రస్తుతానికైతే తెలియదు. ఫేస్‌బుక్‌లోనూ యూజర్లు అవతార్ ఎంపికను పొందుతారు. బహుశా ఇలాంటిదే వాట్సాప్‌లోనూ అందించేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది.

త్వరలో అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి..

WhatsApp ఇటీవల తన ప్లాట్‌ఫారమ్‌కు అనేక కొత్త ఫీచర్‌లను జోడించింది. అనేక కొత్త వాటిపై పని జరుగుతోంది. మెసేజ్ రియాక్షన్ ఫీచర్ యాప్‌కి ఇటీవల జోడించింది. దీని కొత్త అప్‌డేట్ ఇప్పుడు వస్తోంది. ఈ ఫీచర్ సహాయంతో మీరు ఒకరి WhatsApp సందేశానికి కూడా ప్రతిస్పందించవచ్చు.

దీనితో పాటు, వినియోగదారులు బ్యాన్ అప్పీల్ ఎంపికను కూడా పొందనున్నారు. ఈ ఫీచర్ సహాయంతో, ఖాతా నిషేధించబడిన వినియోగదారులు అప్పీల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?