Plastic: భూమిలో కలిసిపోయేందుకు ఏ ప్లాస్టిక్‌ ఎంత కాలం పడుతుంది..?

Plastic: ఈ సృష్టిలో మనం జీవించేందుకు అవకాశం ఉన్న ఏకైక గ్రహం భూమి. అలాంటి భూమిని మనం నాశనం చేసేస్తున్నాము. ఈ భూమిలో ఎన్నో వ్యవర్థాలను వేస్తూ..

Plastic: భూమిలో కలిసిపోయేందుకు ఏ ప్లాస్టిక్‌ ఎంత కాలం పడుతుంది..?
Follow us

|

Updated on: Jul 01, 2022 | 8:48 AM

Plastic: ఈ సృష్టిలో మనం జీవించేందుకు అవకాశం ఉన్న ఏకైక గ్రహం భూమి. అలాంటి భూమిని మనం నాశనం చేసేస్తున్నాము. ఈ భూమిలో ఎన్నో వ్యవర్థాలను వేస్తూ మానవళికి ప్రమాదకరంగా మారేలా చేస్తున్నాము. చెత్తా ప్లాస్టిక్‌ అంతా డ్రైనేజీ, సముద్రాలు, చెరువులు, నదులు, ఇలా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు ఉండిపోతున్నాయి. ఫలితంగా జంతువులు, పక్షులు, జలచరాలు, కీటకాలు అన్ని చనిపోతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం సింగిల్‌ యాజ్‌ ప్లాస్టిక్‌ను వాడవద్దని సూచిస్తోంది. మనం రోజువారీ వాడి పారేసిన వస్తువులు, భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలిస్తే మన ఎంత పొరపాటు చేస్తున్నామో అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ప్లాస్టిక్‌ వ్యవర్థాలను భూమిపై పడేయడంతో అవి భూమిలో కరిగిపోకుండా ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. మనకు మనమే తర్వాత ఆ వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్‌ బిన్స్‌లోనే వేసి రీసైక్లింగ్‌ అయ్యేలా చేసి భూమిని కాపాడుకుందాం. అయితే ప్లాస్టిక్‌కు సంబంధించిన పలు రకాలను భూమిలో వేయడం వల్ల అవి కరిగిపోవడానికి ఎంత కాలం పడుతుందో చూద్దాం.

భూమిలో కలిసిపోయేందుకు ఏ వస్తువు ఎంత కాలం..

ప్లాస్టిక్ బ్యాగ్-500-1000 ఏళ్లు, మిల్క్ ప్యాకెట్ (టెట్రా) కవర్ – 5 ఏళ్లు, గ్లాస్ బాటిల్ – 10-20 లక్షల ఏళ్లు, ప్లాస్టిక్ కప్స్ – 50 ఏళ్లు, మిల్క్ కార్టన్ – 5 ఏళ్లు, అల్యూమినియం క్యాన్ – 80-200 ఏళ్లు, సన్నటి ప్లాస్టిక్ బ్యాగ్స్ – 10-20 ఏళ్లు, యాపిల్ తొక్కు – 2 నెలలు జిప్ ఉండే బ్యాగ్స్ – 500-1000 ఏళ్లు, క్రిస్ప్ ప్యాకెట్లు – 450-1000 ఏళ్లు, సెరియల్ బాక్స్ – 6 వారాలు, ప్లాస్టిక్ స్ట్రా – 200 ఏళ్లు, ప్లైవుడ్ – 1-3 ఏళ్లు, జ్యూస్ కార్టన్ – 300 ఏళ్లు, కాఫీ కప్పు – 30 ఏళ్లు, చిన్న టెట్రా ప్యాక్ – 5 ఏళ్లు

ఇవి కూడా చదవండి

రోజువారీగా వాడే వస్తువులు :

టూత్ బ్రష్ – 400 ఏళ్లు, పెన్ – 450 ఏళ్లు, టిన్ క్యాన్స్ – 50 ఏళ్లు, ప్లాస్టిక్ బాటిల్ – 100 ఏళ్లు, కార్పెట్ – 30-40 ఏళ్లు, బ్యాటరీస్ – 100 ఏళ్లు, లంబర్ – 10-15 ఏళ్లు, టిన్ క్యాన్ – 50 ఏళ్లు, పెయింట్ వేసిన బోర్డ్ – 13 ఏళ్లు, కార్డ్ బోర్డ్ – 2 నెలలు పేపర్ టవల్ – 2-4 వారాలు, పిల్లల డైపర్లు – 500-800 ఏళ్లు, న్యూస్ పేపర్ – 6 వారాలు, కారు టైర్లు – 50 ఏళ్లు,

ఇతర వస్తువులు :

ట్రైన్ టికెట్ – 2 వారాలు, గ్లాస్ – నిర్ధారించలేదు. సిగరెట్ ఫిల్టర్ – 5 ఏళ్లు, సిగరెట్ – 1-12 ఏళ్లు, పెయింట్ వేసిన చెక్క కర్ర – 13 ఏళ్లు, ఫిషింగ్ లైన్ – 600 ఏళ్లు, లెదర్‌ షూస్‌ – 25-40 ఏళ్లు, తాడు – 3-4 నెలలు, కాటన్ బట్టలు – 1-5 నెలలు, నైలాన్ బట్టలు – 30-40 ఏళ్లు, శానిటరీ ప్యాడ్స్ – 500-800 ఏళ్లు, ఉన్ని బట్టలు – 1-5 ఏళ్లు, కాటన్ గ్లోవ్స్ – 1 – 5 నెలలు, రబ్బర్ బూట్ సోల్ – 50-80 ఏళ్లు, హెయిర్ స్ప్రే బాటిల్ – 200-500 ఏళ్లు, డిస్పోజబుల్ డైపర్స్ – 250-500 ఏళ్లు, లెదర్ బ్యాగ్, వాలెట్ – 50 ఏళ్లు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!