Bank Holidays In July 2022: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. జూలై నెలలో బ్యాంకులకు14 రోజులు సెలవులు.. ఏయే రోజు అంటే..
Bank Holidays In July 2022: జూలై నెల వచ్చేసింది. చాలా మందికి ప్రతి రోజు బ్యాంకులకు సంబంధించిన పనులు ఎన్నో ఉంటాయి. అయితే ప్రతి నెల బ్యాంకులకు..
Bank Holidays In July 2022: జూలై నెల వచ్చేసింది. చాలా మందికి ప్రతి రోజు బ్యాంకులకు సంబంధించిన పనులు ఎన్నో ఉంటాయి. అయితే ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వాటిని ముందస్తుగా గమనిస్తే ఎంతో మేలు. జూలై నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే బ్యాంకు పనులు చేసుకునేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్బీఐ ప్రతి నెల బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ప్రకటిస్తుంటుంది. జూలై నెలలో దేశ వ్యాప్తంగా ఆయా బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నెలలో వారాంతపు సెలవులు, ఆయా రాష్ట్రాల్లో పండుగలు ఉన్నాయి. సెంట్రల్ బ్యాంకు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకులకు సంబంధించి నెలవారీ సెలవుల జాబితాను విడుదల చేస్తుంది.
జూలై నెలలో బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. బక్రీద్ పర్వదినం సందర్భంగా జూలై 9న బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. ఇది కాకుండా ఈ నెల 5 ఆదివారాలు, 2 శనివారాలు కూడా బ్యాంకులు పనిచేయవు. అయితే, ఇవి మొత్తం దేశంలో ఒకే రోజు సెలవులు కావు. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించుకునే పండుగల ప్రకారం ఈ సెలవులు ఉంటాయి. మరి ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో చూద్దాం.
జూలై 1: కాంగ్ (రథయాత్ర)/రథయాత్ర – భువనేశ్వర్-ఇంఫాల్‌లో బ్యాంక్‌లు పనిచేయవు.
జూలై 3: ఆదివారం (వారాంతపు సెలవు)
జులై 5: మంగళవారం – గురు హరగోవింద్ సింగ్ జి ప్రకాష్ దివాస్ – జమ్మూ అండ్ కాశ్మీర్
జూలై 7: ఖర్చి పూజ – అగర్తలాలో బ్యాంకులు పనిచేయవు
జూలై 9: శనివారం (నెలలో రెండవ శనివారం), ఈద్-ఉల్-అజా (బక్రీద్)
జూలై 10: ఆదివారం (వారాంతపు సెలవు)
జూలై 11: ఈద్-ఉల్-అజా- జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూతపడతాయి
జూలై 13: భాను జయంతి- గ్యాంగ్‌టక్‌లో బ్యాంక్‌లు పనిచేయవు
జూలై 14: బెన్ డియెంక్లామ్ – షిల్లాంగ్‌లో బ్యాంక్‌లు పనిచేయవు
జూలై 16: హరేలా – డెహ్రాడూన్ బ్యాంక్
జూలై 17: ఆదివారం (వారాంతపు సెలవు)
జూలై 23: శనివారం (నాల్గవ శనివారం)
జూలై 24: ఆదివారం (వారాంతపు సెలవు)
జూలై 31: ఆదివారం (వారాంతపు సెలవు)
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి