Nitin Gadkari: మీరు 8 సీట్ల వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఎయిర్‌ బ్యాగ్స్‌పై కొత్త నిబంధనలు

Nitin Gadkari: ప్రయాణికుల భద్రత కోసం కారులో ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి . ప్రమాదం జరిగితే ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుంటుంది. దీంతో ప్రాణాల నుంచి తప్పించుకోవచ్చు. ప్రయాణికులు..

Nitin Gadkari: మీరు 8 సీట్ల వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఎయిర్‌ బ్యాగ్స్‌పై కొత్త నిబంధనలు
Follow us
Subhash Goud

|

Updated on: Jun 28, 2022 | 12:15 PM

Nitin Gadkari: ప్రయాణికుల భద్రత కోసం కారులో ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి . ప్రమాదం జరిగితే ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుంటుంది. దీంతో ప్రాణాల నుంచి తప్పించుకోవచ్చు. ప్రయాణికులు తీవ్రమైన గాయం నుండి రక్షించుకోవచ్చు. తప్పనిసరి ఎయిర్‌బ్యాగ్‌లకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం నిరంతరం కఠినతరం చేస్తోంది. ఎనిమిది సీట్ల వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రభుత్వం తప్పనిసరి చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దీని కింద ఎనిమిది మంది ప్రయాణికులు ప్రయాణించే వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను వాహన తయారీదారులు అందజేస్తారు. ఇంటెల్ ఇండియా సేఫ్టీ పయనీర్స్ కాన్ఫరెన్స్ 2022ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ.. దేశంలో ప్రతి సంవత్సరం ఐదు లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మరణిస్తున్నారని అన్నారు. మోటారు వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరిగా అందించాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం. ఇందుకు ఆటో పరిశ్రమతోపాటు అన్ని వర్గాల సహకారం అవసరమని ఆయన అన్నారు.

భారతదేశంలో రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంలో పరిశ్రమ, విద్యాసంస్థలు, ప్రముఖ ప్రభుత్వ సంస్థలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఇంటెల్ దేశ రాజధానిలో ఈ సమావేశాన్ని నిర్వహించింది.

2022 జనవరిలోనే నోటిఫికేషన్ 

ఇవి కూడా చదవండి

ఎనిమిది సీట్ల వాహనాలకు అవసరమైన ఆరు ఎయిర్‌బ్యాగ్‌లకు సంబంధించి 14 జనవరి 2022న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. అక్టోబర్ 1, 2022 నుండి M1 కేటగిరీ వాహనాలకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అవసరం. వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడం, పక్కపక్కనే ఢీకొనడం వంటి వాటి ప్రభావాన్ని తగ్గించి ప్రయాణికులను సురక్షితంగా ఉంచేందుకు వాహనాల్లో మరో నాలుగు ఎయిర్ బ్యాగ్ లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెనుక సీటుపై రెండు వైపులా ఎయిర్‌బ్యాగ్‌లు. రెండు ట్యూబ్ ఎయిర్‌బ్యాగ్‌లు అందించడం వల్ల ప్రయాణికులందరికీ ప్రయాణం సురక్షితంగా ఉంటుందని గడ్కరీ చెప్పారు.

2020లో రోడ్డు ప్రమాదాల్లో 47984 మంది మృతి:

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2020 సంవత్సరంలో జాతీయ రహదారులపై మొత్తం 1.16 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవించగా, అందులో 47,984 మంది మరణించారు. ప్రధానంగా దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే చిన్న కార్లకు కూడా ప్రమాదం జరిగినప్పుడు అందులో కూర్చున్న వారి ప్రాణాలను కాపాడేందుకు సరైన ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలని గడ్కరీ గతేడాది చెప్పారు. అధిక ధరలు ఉన్న పెద్ద కార్లలో మాత్రమే కార్ల తయారీదారులు ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లను అందజేస్తారని ఆయన చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి