SIM Cards: మీ పేరుపై ఒకటి కంటే ఎక్కువ సిమ్‌ కార్డులున్నాయా..? తెలుసుకోవడం ఎలా..? మరి ఎలా బ్లాక్‌ చేసుకోవాలి.?

SIM Cards: ప్రస్తుతం మొబైళ్ల వినియోగం పెరిగిపోయింది. చిన్నారులకు సైతం ఓ మొబైల్‌ ఉండిపోతుంది. అయితే చాలా మంది ఎన్నో సిమ్‌ కార్డులను తీసుకుంటారు..

SIM Cards: మీ పేరుపై ఒకటి కంటే ఎక్కువ సిమ్‌ కార్డులున్నాయా..? తెలుసుకోవడం ఎలా..? మరి ఎలా బ్లాక్‌ చేసుకోవాలి.?
Follow us
Subhash Goud

|

Updated on: Jun 28, 2022 | 9:02 AM

SIM Cards: ప్రస్తుతం మొబైళ్ల వినియోగం పెరిగిపోయింది. చిన్నారులకు సైతం ఓ మొబైల్‌ ఉండిపోతుంది. అయితే చాలా మంది ఎన్నో సిమ్‌ కార్డులను తీసుకుంటారు. గతంలో టెలికం కంపెనీలు ఉచిత బ్యాలెన్స్‌, వ్యాలిడిటీ ఇచ్చిన సమయంలో ఒకటి కంటే ఎక్కువ సిమ్‌ కార్డులను తీసుకుని, బ్యాలెన్స్‌, వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత పక్కనపడేస్తుంటారు. అలాగే కొందరు సిమ్‌ కార్డులను పోగొట్టుకుంటారు. తర్వాత వేరే సిమ్‌ కార్డు తీసుకోవడం, లేదా ఒకటి కంటే ఎక్కువ సిమ్‌ కార్డులను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి 9 సిమ్‌ కార్డులు మాత్రమే ఉండాలని, అంతకంటే ఎక్కువ సిమ్‌ కార్డులు ఉంటే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఎక్కువ సిమ్‌ కార్డులుంటే బ్లాక్‌ చేసుకోవచ్చు..

ఇక కొందరికైతే వారి పేరుపైన ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయనే విషయం కూడా తెలియదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ది చెందిన కారణంగా ఒక వ్యక్తిపై ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే ఒక వేళ వాడని సిమ్‌ కార్డులు ఉంటే కూడా వాటిని బ్లాక్‌ చేసుకోవచ్చు. కొందరు సైబర్‌ నేరగాళ్లు ఇతరుల పేర్లపై సిమ్‌ కార్డులను తీసుకుని మోసాలకు పాల్పడుతుంటారు.

ఇవి కూడా చదవండి

మీ పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులున్నాయో తెలుసుకోండిలా..

ఆధార్‌తో లింకైన సిమ్‌ కార్డుల దుర్వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని టెలికాం శాఖ ఇటీవల టూల్‌ అనలటిక్స్‌ ఫర్‌ ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ (TAFCOP)ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్‌లైన్‌ టూల్‌, పోర్టల్‌తో యూజర్లు ఆధార్‌ నెంబర్‌తో లింకైన మొబైల్‌ నెంబర్లను అన్నింటిని తెలుసుకునే వెసులుబాటు ఉంది.

ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీ ఆధార్‌ కార్డు పై ఇప్పటి వరకు ఎన్ని సిమ్‌ కార్డులను ఉపయోగించారో తెలుసుకోవచ్చు. ఇక మీకు తెలియకుండా మీ ఆధార్‌ నెంబర్‌తో ఏదైనా ఫోన్‌ నెంబర్‌ లింకైనట్లు తేలినట్లయితే మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీ పేరుపై పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీని వల్ల మీరు మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని ఎంటర్‌ చేస్తే మీ పేరుపై ఉన్న మొబైల్‌ నెంబర్లు కనిపిస్తాయి. వాటిని బ్లాక్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.

Sim Card Website

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..