Savings Scheme Interest Rates: కేంద్రం ఈ స్కీమ్‌లో ఉన్నవారికి గుడ్‌న్యూస్ చెప్పబోతోందా..? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..!
Savings Scheme Interest Rates: ఆదాయాన్ని పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఉండే స్కీమ్‌లలో ..
Savings Scheme Interest Rates: ఆదాయాన్ని పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఉండే స్కీమ్‌లలో పెట్టుబడులు పెడితే మంచి రాబడిని అందుకోవచ్చు. అయితే మధ్య తరగతి వారికి కేంద్రం ఊరట కలిగించే నిర్ణయం తీసుకోనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం.. మోడీ సర్కార్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లపై వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నట్లు సమాచారం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ది యోజన పథకం, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వంటి తదితర పథకాలపై ఈనెల చివరి వరకు వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్కీమ్‌లపై డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వారు జూన్ 30న వడ్డీ రేట్లు అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఈ స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం ప్రతి త్రైమాసికం చివరిలో పోస్ట్‌ఆఫీస్ పొదుపు పథకాలకు తాజా రేట్లను ప్రకటిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెండు సార్లు కీలక రెపో రేటును పెంచింది.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లపై ప్రస్తుత వడ్డీ రేట్లు
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లపై ప్రస్తుత వడ్డీ రేట్లు ఇక్కడ ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చాయి. అలాగే ఈ నెలాఖరు వరకు అంటే జూన్ 30 వరకు ఈ వడ్డీ రేట్లు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఈ స్కీమ్‌లపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లు:
☛ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: 7.1 శాతం
☛ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 6.8 శాతం
☛ సుకన్య సమృద్ధి యోజన: 7.6 శాతం
☛ కిసాన్ వికాస్ పత్ర: 6.9 శాతం
☛ సేవింగ్స్ డిపాజిట్: 4 శాతం
☛ 1 సంవత్సరం టైమ్ డిపాజిట్: 5.5 శాతం
☛ 2 సంవత్సరాల టైమ్ డిపాజిట్: 5.5 శాతం
☛ 3-సంవత్సరాల టైమ్ డిపాజిట్: 5.5 శాతం
☛ 5 సంవత్సరాల కాల డిపాజిట్: 6.7 శాతం
☛ 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్: 5.8 శాతం
☛ 5 సంవత్సరాల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: 7.4 శాతం
☛ 5 సంవత్సరాల నెలవారీ ఆదాయ ఖాతా: 6.6 శాతం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి