PNB Customer Care: మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్ ఉందా..? నిమిషాల్లోనే సమస్యలకు పరిష్కారం
PNB Customer Care: బ్యాంకు కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ ద్వారా..
PNB Customer Care: బ్యాంకు కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)లో ఖాతాకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే, ఇప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేశంలోని ప్రభుత్వ బ్యాంకు ద్వారా కొన్ని ప్రత్యేక నంబర్‌లను కేటాయించాయి. ఒక్క ఫోన్‌కాల్ చేయడం ద్వారా మీ సమస్య నిమిషాల్లో పరిష్కరించుకోవచ్చు. దీనికి సంబంధించిన సమాచారాన్ని బ్యాంకు కూడా ట్వీట్ ద్వారా తెలియజేసింది.
బ్యాంక్ కస్టమర్లు టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించడం ద్వారా తమ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు. ఎలాంటి సమస్యలకైనా టోల్ ఫ్రీ నంబర్లు 1800-103-2222, 1800-180-2222, 0120-249-0000 నంబర్లకు కాల్ చేయాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఈ అన్ని నంబర్లలో మీరు మీ బ్యాంకింగ్ సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు.
ఈ నెంబర్ల ద్వారా ఎలాంటి సమస్యలకు పరిష్కారం ☛ బ్యాలెన్స్ సమాచారం
☛ చివరి 5 లావాదేవీలు
☛ డెబిట్ కార్డ్‌ని జారీ కోసం/బ్లాక్ చేయండి
☛ పిన్ జనరేట్ చేయడం
☛ పిన్ మార్చడం
☛ కార్డ్‌ని ప్రారంభించడం, నిలిపివేయడం
☛ చెక్ బుక్ స్థితిని తనిఖీ చేయడం
☛ డెబిట్ కార్డ్ లావాదేవీ పరిమితిని అప్‌డేట్ చేయండి
☛ ఇ-స్టేట్‌మెంట్‌ను నమోదు
☛ UPIని బ్లాక్ చేయడం
☛ చెక్కు ద్వారా చెల్లింపు రద్దు
☛ ఖాతాను స్తంభింపజేయడం
మీరు ఈ లింక్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి