Railway Rules: రాత్రి సమయాల్లో రైలులో ప్రయాణిస్తున్నారా..? ఈ విషయాలను తప్పకుండా గుర్తించుకోండి.. లేకపోతే జరిమానే..!
Indian Railway: భారతీయ రైల్వే నియమాలు: భారతీయ రైల్వేలు భారతదేశంలోని సామాన్య ప్రజల జీవితంలో అంతర్భాగంగా పరిగణించబడుతున్నాయి..
Indian Railway: భారతీయ రైల్వే నియమాలు: భారతీయ రైల్వేలు భారతదేశంలోని సామాన్య ప్రజల జీవితంలో అంతర్భాగంగా పరిగణించబడుతున్నాయి. ప్రతిరోజు లక్షల మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేశాఖ వారి సౌకర్యాల కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. రాత్రిపూట ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు ఈ నియమాలను పాటించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. లేదంటే, తర్వాత జరిమానా లేదా జైలు శిక్ష విధించవచ్చు. అందుకే ఆ నియమాల గురించి తెలుసుకుందాం.
రాత్రిపూట ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాత్రిపూట ప్రయాణీకులెవరూ పెద్దగా పాటలు పాడకూడదు. అలాగే బిగ్గరగా మాట్లాడటం కూడా నిషేధించబడింది. ఇలా చేయడం ద్వారా ఇతర ప్రయాణికులు మీకు ఫిర్యాదు చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో ఇతరుల నిద్రను భంగపరిచినందుకు రైల్వే మీకు జరిమానా కూడా విధించవచ్చు.
రాత్రి వేళల్లో ప్రయాణికులెవరూ లైట్లు వేయలేరు. ఇలా చేయడం వల్ల మిగిలిన ప్రయాణికులకు నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లైట్లు వెలిగించడం నిషేధం.
దీనితో పాటు రైల్వేలు నిద్ర, మేల్కొలపడానికి, మిడిల్ బెర్త్‌కు సంబంధించి కొన్ని నిబంధనలను కూడా ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే మిడిల్ బెర్త్‌ను వినియోగించుకోవచ్చు. దీని తర్వాత మీరు మీ సీటును దించేయాల్సి ఉంటుంది. తద్వారా మిగిలిన ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చుని వారి ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి