Aadhaar Link: మీకు ఒకటికంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా..? మీ ఆధార్‌ ఏయే బ్యాంకుకు లింక్‌ అయ్యిందో తెలుసుకోండిలా

Aadhaar Link: ప్రస్తుతం ఆధార్‌ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ప్రతిదానికి ఆధార్‌ను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది..

Aadhaar Link: మీకు ఒకటికంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా..? మీ ఆధార్‌ ఏయే బ్యాంకుకు లింక్‌ అయ్యిందో తెలుసుకోండిలా
Follow us
Subhash Goud

|

Updated on: Jun 26, 2022 | 3:45 PM

Aadhaar Link: ప్రస్తుతం ఆధార్‌ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ప్రతిదానికి ఆధార్‌ను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు రేషన్‌ కార్డు, బ్యాంకింగ్‌ రంగంలో, ఇతర చిన్నపాటి పనులకు కూడా ఆధార్‌ కార్డు తప్పనిసరి అయిపోయింది. ఇది లేనిది పనులు జరగవు. ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన అకౌంట్లలో జమ అవుతుంటాయి. ఆధార్‌ కార్డు (Aadhaar Card) లింక్‌ కాని పక్షంలో వెంటనే చేసుకోవాలని ఇప్పటికే అధికారుల పదేపదే కోరుతున్నారు. దీంతో బ్యాంకు అకౌంట్‌ (Bank Account)కు ఆధార్ నెంబర్ అనుసంధానం చేయడం తప్పనిసరిగా మారిపోయింది. అయితే రెండు మూడు, ఇంకా అంతకంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవాళ్లు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయిందో తెలియక సతమతమవుతుంటారు.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ సేవలను అందిస్తోంది. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ లో మీరు మీ ఆధార్ నెంబర్‌ను ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేశారో తెలుసుకోవచ్చు. అయితే ముందుగా మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాంటి సమయంలోనే ఈ వివరాలు తెలుస్తాయి. ఒకవేళ మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే చేసుకోవాలి.

ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకోవడం ఎలా..?

ఇవి కూడా చదవండి

☛ ముందుగా యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

☛ హోమ్ పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేయండి.

☛ Check Aadhaar Bank Linking Status లింక్ పైన క్లిక్ చేయండి.

☛ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

☛ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.

☛ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి.

☛ ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయండి.

☛ మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

☛ ఓటీపీ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.

మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయిందో వివరాలు కనిపిస్తాయి. మీ ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు, బ్యాంక్ లింక్ స్టేటస్, ఎప్పటి నుంచి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయింది.. ఏ బ్యాంకుతో ఆధార్ నెంబర్ లింక్ అయిందో వివరాలు తెలుస్తాయి. ఒక వేళ మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ కానట్లయితే మీరు మీ ఖాతా ఉన్న బ్యాంకు వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. మీకు రెండు మూడు బ్యాంక్ ఖాతాలున్నట్లయితే మీరు ప్రభుత్వ పథకాలకు చెందిన డబ్బుల్ని ఏ అకౌంట్‌లోకి పొందాలనుకుంటే ఆ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం.. రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు
ఏపీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం.. రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..