AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Insurance: మీరు ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటున్నారా..? ఈ విషయాలను గుర్తించుకోండి

Health Insurance: ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం నేటి కాలంలో అతిపెద్ద అవసరంగా మారింది. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి ఆరోగ్య బీమాను కొనుగోలు..

Health Insurance: మీరు ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటున్నారా..? ఈ విషయాలను గుర్తించుకోండి
Subhash Goud
|

Updated on: Jun 26, 2022 | 2:58 PM

Share

Health Insurance: ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం నేటి కాలంలో అతిపెద్ద అవసరంగా మారింది. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగింది. ఏదైనా అనారోగ్యం తలెత్తితే ఆస్పత్రిలో బిల్లు చెల్లించే విషయంలో ఎంతో ఆసరాగా ఉంటుంది. ఖర్చుల బారి నుంచి తప్పించుకోవచ్చు. అయితే చాలా మంది ప్రజలు ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తారు. దీని కారణంగా పలు ప్రయోజనాలను పొందలేకపోతారు. అందుకే పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తించుకోవాలి.

ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను తనిఖీ చేయండి

మీరు బీమా పాలసీని కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు ముందుగా క్లెయిమ్ సెటిల్‌మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. బీమా పాలసీ సరైన సమయంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేయకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ డిజిటలైజేషన్ యుగంలో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ చాలా వేగంగా మారింది. దీని కారణంగా ప్రజలు తమ క్లెయిమ్‌లను త్వరగా చేసుకోగలుగుతున్నారు.

ఇవి కూడా చదవండి

వెయిటింగ్ పీరియడ్ గురించి జాగ్రత్త వహించండి

ఏదైనా పాలసీలో అత్యంత ముఖ్యమైన విషయం దాని వెయిటింగ్ పీరియడ్. కొన్ని కంపెనీలు తమ కస్టమర్లకు లాంగ్ వెయిటింగ్ పీరియడ్ ఇస్తాయి. దీని కారణంగా వారు పాలసీ తీసుకున్న తర్వాత ఎక్కువ కాలం బీమా కవరేజీని పొందలేరు. అటువంటి పరిస్థితిలో కస్టమర్లు తక్కువ వెయిటింగ్ పీరియడ్‌తో ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడానికి ప్రయత్నించాలి.

పాలసీ నిబంధనలను సరిగ్గా చదవండి

అలాగే, ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేటప్పుడు పాలసీ టర్మ్, షరతును సరిగ్గా చదవడం చాలా ముఖ్యం. పాలసీ గురించి సరిగ్గా తెలుసుకోకపోతే పాలసీ క్లెయిమ్‌ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. పాలసీలో ఆస్పత్రులకు సంబంధించిన వివరాలను తెలుసుకోండి. ఏదైనా అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరితే ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో తెలుసుకోండి. మీరు తీసుకున్న పాలసీలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకు వర్తిస్తుందనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. అందులో ఏయే ఆస్పత్రులు ఉన్నాయో కూడా తెలుసుకోవడం ముఖ్యం.

పాలసీ తీసుకునేటప్పుడు సరైన వివరాలు..

మీరు పాలసీ తీసుకునేటప్పుడు సరైన పత్రాలు అందించాలి. పాలసీ తీసుకునేటప్పుడు ఇచ్చిన పత్రాలు క్లెయిమ్‌ చేసుకునేటప్పుడు కూడా వివరాలన్ని సరిపోల్చాలి.వివరాలు సరిగ్గా లేకున్నా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ చదవండి

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ