TDS: డాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు షాక్.. ఇకపై TDS పరిధిలోకే..

నాన్స్ యాక్ట్ 2022 ప్రకారం ఆదాయ పన్ను చట్టం, 1961లో కొత్త సెక్షన్ 194Rని యాడ్ చేశారు. దీని ప్రకారం జులై 1 నుంచి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, డాక్టర్‌లకు సేల్స్ ప్రమోషన్ కోసం వ్యాపారం నుంచి పొందే ప్రయోజనాలపై..

TDS: డాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు షాక్.. ఇకపై TDS పరిధిలోకే..
Tax
Follow us

|

Updated on: Jun 25, 2022 | 9:46 PM

ఆదాయపు పన్ను శాఖ TDSకు సంబంధించి సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. జులై 1 నుంచి కొత్త TDS నియమాలు అమల్లోకి వస్తున్నాయి. వ్యాపారం లేదా వృత్తిలో ప్రయోజనాలు పొందడానికి సంబంధించిన టీడీఎస్ మార్గదర్శకాలను నోటిఫై చేసింది. ఫైనాన్స్ యాక్ట్ 2022 ప్రకారం ఆదాయ పన్ను చట్టం, 1961లో కొత్త సెక్షన్ 194Rని యాడ్ చేశారు. దీని ప్రకారం జులై 1 నుంచి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, డాక్టర్‌లకు సేల్స్ ప్రమోషన్ కోసం వ్యాపారం నుంచి పొందే ప్రయోజనాలపై టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఏవైనా పరికరాలు కంపెనీ నుంచి ఓ వ్యక్తి తీసుకుంటే దానికి టీడీఎస్ చెల్లించాలి. ఒక వేళ ఆ పరికరాలను కంపెనీకి ఆ వ్యక్తి తిరిగి ఇస్తే ఎటువంటి టీడీఎస్ చెల్లించనవసరం లేదు. టాక్స్‌ రెవెన్యూ లీకేజీని చెక్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఆదాయంపై TDS నిబంధనను తీసుకొచ్చింది. సంవత్సరంలో రూ.20,000 కంటే ఎక్కువ ప్రయోజనాన్ని అందించే ఏ వ్యక్తికైనా 10 శాతం TDS వర్తిస్తుంది.

ప్రయోజనాలు, పర్క్విసిట్(perquisite) కిందకి ఏవి వస్తాయి?

ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం డాక్టర్లు ఇకపై ఎటువంటి బెనిఫిట్స్ మెడికల్ కంపెనీల నుంచి అందుకున్నా టీడీఎస్ కట్ అవుతుంది. డాక్టర్లకు కంపెనీలు ఇచ్చే ఫ్రీ శాంపిల్ మెడిసిన్స్, విదేశీ విమాన టిక్కెట్లు లేదా వ్యాపార సమయంలో ఉచిత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టిక్కెట్లు వంటి ఎటువంటి బెనిఫిట్స్ పొందినా టీడీఎస్ పరిధిలోకి వస్తారు. ఆదాయపన్ను రిటర్న్‌ దాఖలు చేసేటప్పుడు వీటిని వెల్లడించాలి. ఈ వస్తువులను సేల్ చేయడం లేదనే కారణంతో రిటర్న్స్‌లో చూపించకుండా ఉండడం ఇకపై కుదరదు. కారు, టీవీ, కంప్యూటర్‌లు, బంగారు నాణేలు, మొబైల్ ఫోన్‌ల వంటి నగదు లేదా వస్తువులో ఉన్న డిస్కౌంట్ లేదా రిబేట్ కాకుండా ప్రోత్సాహకాలు ఇచ్చే విక్రేతకు కూడా సెక్షన్ 194R వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు వైద్యులు ఉచితంగా మెడిసిన్స్ ఫ్రీ శాంపిల్స్ తీసుకుంటే, ఆసుపత్రికి ఉచిత నమూనాల పంపిణీపై సెక్షన్ 194R వర్తిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ స్పష్టం చేసింది. ఏదైనా సరే ఆసుపత్రి యజమాని అటువంటి శాంపిల్స్‌ను ఉద్యోగులకు పన్ను విధించదగినదిగా పరిగణించాలి. వీటిపై సెక్షన్ 192 కింద పన్ను మినహాయించవచ్చు. ఇటువంటి సందర్భాలలో ఆసుపత్రికి సంబంధించి రూ.20,000 థ్రెషోల్డ్‌ని చూడాలి. ఆసుపత్రిలో కన్సల్టెంట్‌లుగా పని చేస్తున్న వైద్యులు, ఉచిత నమూనాలను స్వీకరిస్తే.. TDS ముందుగా ఆసుపత్రికి విధిస్తారు. కన్సల్టెంట్ వైద్యులకు సంబంధించి సెక్షన్ 194R కింద పన్ను మినహాయించాల్సి ఉంటుంది.

ఒకవేళ వ్యాపారం లేదా వృత్తిని కొనసాగించకుండా ప్రభుత్వ ఆసుపత్రి వంటి ప్రభుత్వ సంస్థకు ప్రయోజనం లేదా అనుమతి ఇస్తే కనుక సెక్షన్ 194R వర్తించదని CBDT తెలిపింది. సేల్స్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, సెక్షన్ 194R పరిధి నుంచి కస్టమర్‌లను మినహాయించడం ద్వారా వారికి అందే రాయితీలపై కూడా ఇది వర్తిస్తుంది. వాటిని చేర్చడం వల్ల విక్రేతను ఇబ్బందుల్లోకి నెడుతుంది.

ఒకవేళ సంస్థలు ప్రమోషన్‌ (పబ్లిసిటీ) కోసం ఇచ్చిన కార్‌, మొబైల్‌, ఔట్‌ ఫిట్‌ (దుస్తులు) కాస్మోటిక్స్‌ వంటి ప్రొడక్ట్‌లను ఇన్‌ఫ్లూయెన్సర్లు తిరిగి ఇచ్చేస్తే వాటిపై ట్యాక్స్‌ ఉండదని సెక్షన్‌ 194 ఆర్‌ టీడీఎస్‌ నిబంధనలు చెబుతున్నాయని సీబీడీటీ తెలిపింది. అదే ఫ్రీగా పొందే కార్లు, టీవీలు, మొబైల్ ఫోన్‌లు, ఫ్రీ టిక్కెట్‌లు, విదేశీ పర్యటనలు, బిజినెస్‌ కోసం అందించే ఇతర ప్రోత్సహకాలపై టీడీఎస్‌ వర్తించనుంది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?