Funny Bowling: ప్రపంచంలోనే ‘చెత్త’ బౌలింగ్.. యాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు.. Viral Video

తనను తాను ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్‌గా భావిస్తు్న్నాడు. అతని బౌలింగ్ యాక్షన్ చాలా విచిత్రంగా ఉంటుంది. దీంతోనే ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

Funny Bowling: ప్రపంచంలోనే 'చెత్త' బౌలింగ్.. యాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు.. Viral Video
Funny Bowling
Follow us
Venkata Chari

|

Updated on: Jun 24, 2022 | 6:36 PM

క్రికెట్‌లో అభిమానులు ఎన్నో విచిత్రమైన బౌలింగ్ యాక్షలను చూసే ఉంటారు. పాల్ ఆడమ్స్ నుంచి లసిత్ మలింగ వరకు, జస్ప్రీత్ బుమ్రా నుంచి మతిషా పతిరనా వరకు.. ఇలా ఎన్నో ప్రత్యేకమైన శైలిని ఆస్వాదించాం. ఈ జాబితాకు అంతం లేదంటూ ఇంగ్లండ్‌లో విలేజ్ క్రికెట్ ఆడిన జార్జ్ మెక్‌మెనెమీ అంటున్నాడు. తన బౌలింగ్ యాక్షన్‌తో సోషల్ మీడియాలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాడు.

డ్యాన్స్ చేస్తూ బౌలింగ్..

ఇవి కూడా చదవండి

జార్జ్ మెక్‌మెనెమీ తనను తాను ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్‌గా భావిస్తాడు. అతని బౌలింగ్ యాక్షన్ చాలా విచిత్రంగా ఉంటుంది. బంతిని విసిరే ముందు, అతను మొదట డ్యాన్స్ చేస్తాడు. ఆపై బంతిని తన చేతుల్లో ఉంచి, కొన్ని అడుగులు వేసి, విసిరేస్తాడు. ఇటువంటి పరిస్థితిలో బ్యాట్స్‌మన్ బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేడు. బంతి నేరుగా బ్యాటర్‌పైకి వస్తుంది.

తన బౌలింగ్ యాక్షన్ వీడియోను పంచుకుంటూ, జార్జ్ ఇలా వ్రాశాడు, “మిత్రులారా, నేను మూర్ఖుడిని కావచ్చు. నేను ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్‌ని కూడా కావచ్చు. కానీ, ఈ గేమ్ నా జీవితాన్ని కాపాడింది. నా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. నన్ను గొప్ప ఆటగాడిగా మార్చింది. మరోసారి సంతోషంగా ఉండేందుకు ఒక వేదిక ఇచ్చింది. నా తల్లి స్వర్గంలో గర్వపడుతుంది. క్రికెట్‌ని నేను ప్రేమిస్తున్నాను’ అంటూ పేర్కొన్నాడు.

జార్జ్ మెక్‌మెనెమీ పంచుకున్న ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ జోన్స్‌కూడా ఈవీడియోపై కామెంట్ చేశాడు. ‘ఫెంటాస్టిక్ జార్జ్’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. జార్జ్ మెక్‌మెనెమీ తల్లి ట్రేసీ 2017లో మరణించారు. తల్లి మరణానంతరం అనేక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి రావడంతో ఒత్తిడికి లోనయ్యాడు. 2017-18 సంవత్సరంలో యాషెస్ సిరీస్ మ్యాచ్‌లు చూసిన తర్వాత క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఇప్పుడు క్రికెట్ మెక్‌నామీ జీవితాన్ని మార్చేసింది.

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే