PM Kisan: రైతులకు గమనిక.. జూలై 31లోపు ఆ పని చేయాల్సిందే.. లేదంటే డబ్బులు రావు..

పీఎం కిసాన్ డబ్బులను రిటర్న్ ఇచ్చేవారు.. ముందుగా ఆన్ లైన్ పోర్టల్ కు లాగిన్ కావాల్సి ఉంటుంది.. ఆ తర్వాత రీఫండ్ ఆన్ లైన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి..

PM Kisan: రైతులకు గమనిక.. జూలై 31లోపు ఆ పని చేయాల్సిందే.. లేదంటే డబ్బులు రావు..
Pm Kisan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 26, 2022 | 8:34 AM

దేశంలోని అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఒకటి (PM Kisan).. ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఏడాది రైతులకు రూ.6000 నగదును వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.. అయితే ఈ నగదు మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారిగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.. ఇప్పటివరకు 11 విడతల నగదును అన్నదాతల ఖాతాల్లోకి చేర్చింది..అయితే ఈ పథకాన్ని తప్పుగా ఉపయోగించుకున్నవారు అనేక మంది ఉన్నట్లు కేంద్రం గుర్తించింది.. అనర్హులు సైతం పీఎం కిసాన్ నగదును పొందినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇకపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. వారికి నోటీసులు కూడా పంపుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది..

పీఎం కిసాన్ డబ్బులను రిటర్న్ ఇచ్చేవారు.. ముందుగా ఆన్ లైన్ పోర్టల్ కు లాగిన్ కావాల్సి ఉంటుంది.. ఆ తర్వాత రీఫండ్ ఆన్ లైన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.. అనంతరం మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది.. అందులో 12 అంకెల ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.. ఆ తర్వాత క్యాప్చా కోడ్ నమోదు చేసి ‘డేటా పొందండి (గెట్ డేటా) ‘ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ పై మీరు ఏ రిఫండ్ అమౌంట్ కు అర్హులు కాదు అనే మెసేజ్ వస్తే.. మీరు డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.. రిఫండ్ అమౌంట్ ఆప్షన్ కనిపిస్తే మీకు ఎప్పుడైనా రీఫండ్ నోటీసు వచ్చే అవకాశం ఉంది..

ఈ-కేవైసీ అప్డేట్ తప్పనిసరి..

E-KYC అప్డేట్ ఇప్పుడు జూలై 31 వరకు పొడగించింది కేంద్రం. ఇటీవల ఇందుకు సంబంధించిన నోటీసు సైతం జారీ చేసిన ప్రభుత్వం రైతులు తమ కేవైసీ అప్డేట్ చేయాలని కోరింది. E-KYC ప్రక్రియ పూర్తి చేయని రైతులకు తదుపరి విడత డబ్బులు రావు..