PAN Card: మీ పాన్‌ కార్డు పోయిందా..? కొత్త కార్డు కావాలా..? సింపుల్‌ ఇలా చేయండి వచ్చేస్తుంది..!

PAN Card Reprint: పాన్ కార్డ్ రీప్రింట్: పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN) అనేది ఏదైనా ఆర్థిక లావాదేవీకి ఇవ్వాల్సిన తప్పనిసరి పత్రం. బ్యాంకు ఖాతా తెరవడం, పెట్టుబడి..

PAN Card: మీ పాన్‌ కార్డు పోయిందా..? కొత్త  కార్డు కావాలా..? సింపుల్‌ ఇలా చేయండి వచ్చేస్తుంది..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 26, 2022 | 4:10 PM

PAN Card Reprint: పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN) అనేది ఏదైనా ఆర్థిక లావాదేవీకి ఇవ్వాల్సిన తప్పనిసరి పత్రం. బ్యాంకు ఖాతా తెరవడం, పెట్టుబడి పెట్టడం, లావాదేవీలు చేయడం మొదలైన వాటికి పాన్‌ కార్డు తప్పనిసరిగా అవసరమయ్యే డాక్యుమెంట్‌. పాన్ కార్డ్’ అనేది బ్యాంకింగ్, ఆర్థిక సంబంధమైన వ్యవహారులు నిర్వహించేందుకు అతి కీలకమైన డాక్యుమెంట్లలో ఇదొకటి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా.. ఈపీఎఫ్ డబ్బు డిపాజిట్ చేసినా పాన్ తప్పనిసరి. పాన్ (PAN) లేకుండా ఏ రకమైన ఆర్థిక కార్యకలాపాలనూ నిర్వహించేందుకు వీలు కాదు. అయితే వినియోగదారులు తప్పనిసరిగా చాలా చోట్ల పాన్ కార్డ్ (PAN Card) వివరాలను అందించాల్సి ఉంటుంది. అయతే మీ పాన్ కార్డ్ పోయినా, దొంగిలించబడినా లేదా పాడైపోయినా.. ఎలాంటి టెన్షన్‌ పడనక్కరలేదు. ఇంట్లో కూర్చొని కార్డ్‌ని రీప్రింట్ (Card Reprint) చేయడానికి మీరు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఆన్‌లైన్‌లో చేయవచ్చు. దాని పూర్తి ప్రక్రియను తెలుసుకుందాం.

రీప్రింట్ షరతులు:

కార్డు వివరాల్లో ఎలాంటి మార్పు లేకుంటే మాత్రమే రీప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాన్ని NSDL e-Gov ద్వారా ఇటీవల PAN అప్లికేషన్ ద్వారా ప్రాసెస్ చేసిన లేదా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తక్షణ e-PAN సదుపాయాన్ని ఉపయోగించి PAN పొందిన కార్డ్ హోల్డర్‌లు మాత్రమే ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ లింక్‌ని ఉపయోగించండి:

పాన్ కార్డ్ రీప్రింట్ చేయడానికి మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html

ఈ వివరాలను పూరించండి:

మీ పాన్ కార్డ్ రీప్రింట్ చేయడానికి మీరు ఇచ్చిన లింక్‌ని క్లిక్‌ చేసి అందులో కనిపించే వివరాలను నమోదు చేయాలి. మీరు పాన్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన వివరాలను పూరించాలి. కార్డ్‌ని మళ్లీ ముద్రించడానికి ఆధార్ వివరాలను ఉపయోగించడానికి దరఖాస్తుదారు సమ్మతి ఇవ్వాలి. చివరగా ఫారమ్‌ను సమర్పించడానికి మీరు క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.

పాన్ కార్డ్ రీప్రింట్ కోసం రుసుము:

పాన్ కార్డ్ రీప్రింట్, మీ ఇంటికి డెలివరీ చేయడానికి మీరు కొంత రుసుము చెల్లించాలి. ఫారం నింపిన తర్వాత ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో కార్డును డెలివరీ చేయడానికి రూ.50 రుసుము చెల్లించాలి. భారతదేశం వెలుపలి చిరునామాకు కార్డును డెలివరీ చేయడానికి మీరు రూ. 959 చెల్లించాల్సి ఉంటుంది. రుసుము చెల్లించిన తర్వాత మీ రీప్రింట్ చేసిన పాన్ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న చిరునామాకు పంపబడుతుంది.

అలాగే మీరు UTIITSL వెబ్‌సైట్‌లో తాజా PAN దరఖాస్తును చేసి ఉంటే ఈ లింక్‌ని సందర్శించడం ద్వారా రీప్రింట్ అప్లికేషన్‌ను సమర్పించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్