Stock Market: దూకుడు పెంచిన ఐటీ స్టాక్స్.. లాభాలతో ముగిసిన మార్కెట్.. సెన్సెక్స్ 433, నిఫ్టీ 132 పాయింట్లు అప్..

NSEలోని అన్ని 11 రంగాల సూచీలు గ్రీన్ మార్క్‌లోనే ఉన్నాయి. ఐటీ ఇండెక్స్‌ అత్యధికంగా 2.05% లాభపడ్డాయి. మెటల్ ఇండెక్స్ 1.52 శాతం లాభపడ్డాయి.

Stock Market: దూకుడు పెంచిన ఐటీ స్టాక్స్.. లాభాలతో ముగిసిన మార్కెట్.. సెన్సెక్స్ 433, నిఫ్టీ 132 పాయింట్లు అప్..
Stock Market
Follow us
Venkata Chari

|

Updated on: Jun 27, 2022 | 6:02 PM

వారంలో తొలి ట్రేడింగ్ రోజైన సోమవారం మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 433 పాయింట్ల (0.82%) లాభంతో 53,161.28 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 132.80 పాయింట్లు (0.85%) లాభపడి 15,832.05 వద్ద ముగిసింది. ఐటీ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1-2% లాభపడ్డాయి. ఈరోజు సెన్సెక్స్ 15,926 వద్ద ప్రారంభయింది. 740 పాయింట్ల లాభంతో 53,468 వద్ద, నిఫ్టీ 227 పాయింట్లు లాభపడింది. మరోవైపు, శుక్రవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 78.34 వద్ద ముగిసింది.

అన్ని రంగాల సూచీలు గ్రీన్ సిగ్నల్ వైపే..

NSEలోని అన్ని 11 రంగాల సూచీలు గ్రీన్ మార్క్‌లోనే ఉన్నాయి. ఐటీ ఇండెక్స్‌ అత్యధికంగా 2.05% లాభపడ్డాయి. మెటల్ ఇండెక్స్ 1.52 శాతం లాభపడ్డాయి. దీని తరువాత, బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, ప్రైవేట్ బ్యాంక్, రియాల్టీ సెక్టార్ ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌లలో స్వల్ప లాభాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

బజాజ్ ఆటో బైబ్యాక్‌ ..

బజాజ్ ఆటో కంపెనీ షేరు బైబ్యాక్‌కు ఆమోదం తెలిపినట్లు జూన్ 27న స్టాక్ ఎక్స్ఛేంజీకి తెలియజేసింది. మార్కెట్ నుంచి రూ.2500 కోట్లకు కంపెనీ షేర్లను కొనుగోలు చేయనుంది. ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో ఒక్కో షేరుకు రూ.4,600 చొప్పున 54.35 లక్షల షేర్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. బజాజ్ ఆటో షేర్లు ఈరోజు మధ్యాహ్నం 2.36 గంటలకు అర శాతం పెరిగి రూ.3,840.90 వద్ద ట్రేడయ్యాయి. కంపెనీ ప్రస్తుత షేరు ధర కంటే 0.7% ఎక్కువగా షేర్ బైబ్యాక్ చేస్తోంది.