July 1st New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు

Income Tax Rules: ప్రతి రోజు బ్యాంకింగ్‌, ఇతర రంగాలలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి వస్తుంటాయి. అలాగే జూలై 1వ..

July 1st New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు
Subhash Goud

|

Jul 01, 2022 | 7:30 AM

Income Tax Rules: ప్రతి రోజు బ్యాంకింగ్‌, ఇతర రంగాలలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి వస్తుంటాయి. అలాగే జూలై 1వ తేదీ నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పాన్‌-ఆధార్‌ లింక్‌పై ఆలస్య రుసుము రెట్టింపు కానుంది. ఈ నెల నుంచి ఆలస్య రుసుము రూ.500 నుంచి రూ.1000 వరకు పెరగనుంది. ఇది కాకుండా నూత‌న లేబ‌ర్ కోడ్‌లు అమలు కానున్నాయి.

పాన్-ఆధార్ లింకింగ్ కోసం రెట్టింపు రుసుము: ఆధార్-పాన్ లింక్ చేయడానికి చివరి తేదీ 30 జూన్ 20222. CBDT మార్గదర్శకాల ప్రకారం.. ఒక వ్యక్తి 31 మార్చి 2022 నుండి 30 జూన్ 2022 తర్వాత ఆధార్‌తో పాన్‌ను లింక్ చేసినట్లయితే, ఆ వ్యక్తి ఆలస్య రుసుము రూ. 500 చెల్లించాలి. అయితే ఒక వ్యక్తి 30 జూన్ 2022లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైతే అతను జూలై1 2022 నుండి పాన్-ఆధార్ సీడింగ్ కోసం రూ. 1,000 రెట్టింపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది .

క్రిప్టోకరెన్సీలపై TDS: 1 ఏప్రిల్ 2022 నుండి క్రిప్టోకరెన్సీలపై 30 శాతం ఫ్లాట్ ఇన్‌కమ్ ట్యాక్స్ విధించిన తర్వాత, GoI క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై పెట్టుబడిదారుడు పొందే లాభం లేదా నష్టంతో సంబంధం లేకుండా 1 శాతం TDSని అదనంగా విధించబోతోంది. అయితే, నష్టాలతో కూడిన లావాదేవీలపై విధించిన TDS రీఫండ్‌ను పెట్టుబడిదారుడు క్లెయిమ్ చేయగలరు. ఇన్వెస్టర్ క్రిప్టోకరెన్సీ లావాదేవీలలోకి ప్రవేశించినట్లయితే, ITRని ఫైల్ చేయమని సలహా ఇస్తారు.

అలాగే వివిధ సంస్థల ఉద్యోగులు, కంపెనీల కార్మికులు వేత‌నం, ప‌ని గంట‌ల‌తోపాటు వివిధ వ‌ర్గాల వారిపై వ‌డ్డించే ప‌న్నులు త‌దిత‌రాలు మారనున్నాయి. న్యూ వేజ్ కోడ్‌తోపాటు నూత‌న కార్మిక చ‌ట్టాలు అమ‌లు చేయ‌డంతో ఉద్యోగి, కార్మికుడు ప్రతి నెలా వేత‌నం, ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ (PF)లో కంట్రిబ్యూష‌న్ వ‌చ్చేనెల 1వ తేదీ నుంచి మారిపోనున్నాయి. ఇంకా సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు, డాక్టర్లపై టీడీఎస్ నిబంధనలు, ఇతర రూల్స్‌ మారనున్నాయి. టీడీఎస్‌ కొత్త నిబంధ‌న కింద కేంద్ర ప్రత్యక్ష ప‌న్నుల బోర్డు (CBDT) మార్గద‌ర్శకాలు జారీ చేసింది.

అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు లేబ‌ర్ కోడ్‌ల కింద ఇంకా నిబంధ‌న‌లు ఖ‌రారు చేయ‌లేదు. ఇప్పటి వ‌ర‌కు 23 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వేజ్ కోడ్‌ల కింద ముసాయిదా నిబంధ‌న‌లు ప్రచురించాయ‌ని కేంద్ర కార్మిక‌శాఖ మంత్రి రామేశ్వర్ ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. వచ్చే నెలలో కేంద్ర సర్కార్‌ తన ఉద్యోగులకు డియర్‌నెస్‌ అలవెన్స్‌ (DA) పెరగనుంది. ప్రతి యేటా జనవరి, జూలైలో కేంద్రం డీఏను విడుదల చేస్తోంది.

ఇక సైబర్‌ నేరాలను అరికట్టేందుకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) అమలు చేయనున్న టోకేనైజేషన్‌ వ్యవస్థ ముందుగా జూన్‌ 30తో ముగియాల్సి ఉంది. వివిధ పారిశ్రామిక కంపెనీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై జారీ చేయ‌నున్న టోకెనైజేష‌న్ అమ‌లును సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు వాయిదా వేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu