AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plastic Ban: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌పై నిషేధం.. నేటి నుంచి అమలు.. పాటించకపోతే చర్యలు

Plastic Ban: ప్లాస్టిక్‌ నిషేధంపై పోరు ప్రారంభమైంది. ఒకసారి వాడి పారేసిన ప్లాస్టిక్‌ వస్తువులను దేశ వ్యాప్తంగా నిషేధం విధించింది కేంద్రం. ఈ నిషేధం జూలై 1 నుంచి..

Plastic Ban: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌పై నిషేధం.. నేటి నుంచి అమలు.. పాటించకపోతే చర్యలు
Subhash Goud
|

Updated on: Jul 01, 2022 | 8:11 AM

Share

Plastic Ban: ప్లాస్టిక్‌ నిషేధంపై పోరు ప్రారంభమైంది. ఒకసారి వాడి పారేసిన ప్లాస్టిక్‌ వస్తువులను దేశ వ్యాప్తంగా నిషేధం విధించింది కేంద్రం. ఈ నిషేధం జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం అమలుపై ప్రచారం నిర్వహించి తయారీ యూనిట్లు, పంపిణీ కంపెనీలు, విక్రయాలు, నిల్వలను అరికట్టాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు కోరారు. నిషేధంపై ఉల్లంఘించినట్లయితే జరిమానా, జైలు శిక్ష ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

నిషేధిత జాబితాలో ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులు:

ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లాస్టిక్‌ కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, స్వీట్‌ బాక్సులు, సిగరేట్‌ ప్యాకెట్లు, 100 మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్‌, ఇయర్‌బడ్స్‌, బెలూన్లకు వాడే ప్లాస్టిక్‌ స్టిక్స్‌, ప్లాస్టిక్‌ జెండాలు, పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్‌ పుల్లలు, ఐస్‌క్రీమ్‌ పుల్లలు, అలంకరణ కోసం వాడే థర్మోకోల్‌ షీట్లు, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులతోపాటు పీవీసీ బ్యానర్లు, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు లాంటివి నిషేధిత జాబితాలోకి వస్తాయి.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ప్లాస్టిక్‌పై పోరును మరింత తీవ్రం చేస్తోంది. ప్లాస్టిక్‌ వినియోగంపై కీలక ఆదేశాలిచ్చింది. అందరూ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్‌పై రోజురోజూ పోరు తీవ్రం అవుతోంది. ప్లాస్టిక్‌ తయారీ, అమ్మకం, వినియోగంపై కేంద్రం కఠిన ఆంక్షలు విధిస్తోంది. తక్కువ మందం గల కవర్లు పునర్‌ వినియోగానికి ఉపయోగపడకపోగా, పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నాయని భావించి ఈ నిషేధం విధిస్తున్నాయి. దీంతో ఏపీలో ప్లాస్టిక్‌ కవర్లు తయారు చేస్తున్న, అమ్ముతున్న కేంద్రాలపై మున్సిపల్‌ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు.

75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల సరుకును సీజ్‌ చేయడంతో పాటు, భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఒక్కసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్‌, ముఖ్యంగా హోటళ్లు, శుభకార్యాల్లో వినియోగించే ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులు, టేబుల్‌పై పరిచే షీట్లు వంటి వాటి వినియోగాన్ని, జులై 1 నుంచి పూర్తిగా నిషేధిస్తూ, ఏపీ సర్కార్ ఇప్పటికే తాజాగా ఉత్తర్వులిచ్చింది. దీనిపై అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఏపీలో కాలుష్య నియంత్రణ మండలి వద్ద నమోదు చేసుకున్న 139 ప్లాస్టిక్‌ పరిశ్రమలు, తక్కువ మందంగల క్యారీబ్యాగులను తయారుచేస్తున్నాయి. వాటి లైసెన్సులను కూడా అధికారులు రద్దు చేశారు. జులై 1 నాటికి తమ వద్దనున్న సరుకును రీసైక్లింగ్‌కు పంపించాలని, లేకుంటే చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. వ్యాపారులు, ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి